కడప

వాడవాడలా రెపరెపలాడిన మువ్వనె్నల జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)ఆగస్టు 15: 70వ స్వాతంత్య్రదినోత్సవం పురస్కరించుకుని సోమవారం నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలతోపాటు పలు సంఘాల ఆధ్వర్యంలో మువ్వనె్నల జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల కరస్పాండెంట్స్, యాజమాన్యాలు, ముఖ్యఅతిధులు వచ్చి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడి స్వాతంత్య్రం తెచ్చిన నేతల గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే మహాత్మగాంధీ యొక్క జీవిత విశేషాలు స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన వహించిన ప్రధానపాత్రపై, చేసిన ఉద్యమాలపై క్షుణ్ణంగా వివరించారు. అనంతరం విద్యార్థులచేత దేశభక్తిగీతాలు పాడించారు. అలాగే స్వాతంత్య్ర ఉద్యమంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి, స్వీట్లు, చాకెట్లు పంచిపెట్టారు. స్థానిక రవీంద్రనగర్‌లోని ఆల్ షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో 70వ స్వాతంత్య్రవేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సాబీరున్నీసా జాతీయ జెండాను ఎగురవేసి వందనం గావించారు. తర్వాత పిల్లలు దేశభక్తి గీతాలు ఆలపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మనకు స్వాతంత్య్రం రావడానికి కృషి చేసిన మహనీయుల గురించి పిల్లలకు వివరించి వారి బాటలో నడవాలని తెలిపారు. స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన దేశనాయకులను మనందరం స్మరించుకోవాలని రాయలసీమ రాష్టస్రాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇరగంరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. స్థానిక మృత్యుంజయకుంటలో బిజెపి డివిజన్ ఇన్‌చార్జి జికె మునెయ్య ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. తొలుత జెండాను వెంకటరామిరెడ్డి ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం మునెయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం కులమతాలకు అతీతంగా పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎందరో ఉన్నారని అలాంటి వారిని స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి ఆచారి, కొండూరు వెంకటరామరాజు, సుబ్బరాయుడు, గుర్రప్ప, వెంకటరమణారెడ్డి, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు. దేశనాయకుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అలీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం యూత్ జిల్లా అధ్యక్షుడు తన్వీర్ అహ్మద్, కార్యదర్శి ఖలీల్ అహ్మద్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రభుత్వ పథకాల
శకటాలు
70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం స్థానిక పోలీసుపేరేడ్ మైదానంలో వివిధ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రదర్శించిన శకటాల ప్రదర్శన ప్రజాప్రతినిధులను, అధికారులను, ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాష్టమ్రానవ వనరులశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ కెవి సత్యనారాయణ, ఏఎస్పీ విజయ్‌కుమార్, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు శకటాల ప్రదర్శన తిలకించారు. కాగా డిఆర్‌డిఏ, డ్వామా, సర్వశిక్ష అభియాన్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ , హార్టికల్చర్, ట్రాన్స్‌కో, స్ర్తి శిశుసంక్షేమశాఖ, వ్యవసాయశాఖ, అటవీశాఖ, గృహనిర్మాణశాఖ, గ్రామీణ నీటి పారుదలశాఖ, జలవనరులశాఖ అధికారులు తమ శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాలపై శకటాలు ఏర్పాటుచేసి ప్రదర్శించారు.
అలరించిన విద్యార్థుల
సాంస్కృతిక కార్యక్రమాలు
70వ స్వాతంత్య్రదినోత్సవం పురస్కరించుకుని స్థానిక పోలీసు పేరేడ్ మైదానంలో సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పిరమిడ్స్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధానంగా దేశభక్తి ఉట్టిపడేలా చిన్నారుల ప్రదర్శనలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డిఇఓ ప్రతాప్‌రెడ్డితోపాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పెండ్లిమర్రిలో..
పెండ్లిమర్రి: మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌పాఠశాలల్లో 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే తహశీల్దార్ కార్యాలయంలో డిటిఓ కిశోర్‌బాబు, ఎంపిడివో కార్యాలయంలో ఎంపిపి సి.అనూరాధ, ఎంపిడివో మల్‌రెడ్డిలు, పోలీసుస్టేషన్‌లో ఏఎస్‌ఐ నారాయణ, ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఇఓ సుజాత, పశువైద్యశాలలో బాబురామచంద్ర, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో బాలకొండ్రాయుడు, మధుసూదన్‌రెడ్డిలు జెండాను ఎగురవేసి రవీంద్రనాధ్‌ఠాగూర్ రచించిన జాతీయ గీతాన్ని ఆలపించారు.
చెన్నూరులో...
చెన్నూరు: 70వ స్వాతంత్య్రవేడుకలు పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఉదయం ఎంపిపి బాలమ్మ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో వెంకటరమణారెడ్డి, ఎంఇఓ కృష్ణమూర్తి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, జెడ్పిటిసి చీర్ల ఉమాదేవిలు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పొట్టిపాటి రాజేశ్వరి పతాకాన్ని ఎగురవేశారు. మండల తహశీల్దార్ కార్యాలయం, పోలీసుస్టేషన్, స్టేట్‌బ్యాంకు , మండలంలో అన్ని ప్రభుత్వపాఠశాలల్లో జాతీయ పతాకాలు రెపరెపలాడాయి.
ఖాజీపేటలో...
ఖాజీపేట: విద్యార్థులు జాతీయ నాయకుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకుసాగాలని మండల అధ్యక్షురాలు గుజ్జల సుమలత, విద్యాధికారి సివి ప్రసాద్‌లు కోరారు. ఖాజీపేట ఎంపిడివో కార్యాలయంలో ఎండివో ఉషారాణి ఆధ్వర్యంలో జెండాను ఎంపిపి ఎగురవేశారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి బాలస్వామి, బాలికల హైస్కూల్‌లో జెడ్పిటిసి లక్ష్మిదేవి, పోలీసుస్టేషన్‌లో ఏఎస్‌ఐ శంకర్, కస్తూరిబా పాఠశాలలో ప్రత్యేక అధికారి కౌసర్‌భాను జెండా ఎగురవేయగా అతిధిగా పాల్గొన్న విద్యాధికారి ప్రసాద్ విద్యార్థులకు బహుమతులు అందించారు
కమలాపురంలో..
కమలాపురం: మండలంలో 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలపై, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపిపి సులేఖ జాతీయ జెండాను ఎగురవేశారు.
అట్లూరులో..
అట్లూరు: మండలంలో ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 70వ స్వాతంత్య్ర వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో తహశీల్దార్ ఈశ్వరయ్య జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అలాగే ఎంపిడివో కార్యాలయంలో ఎంపిడివో రెడ్డినాయుడు, ఎంపిపి కార్యాలయంలో ఎంపిపి పెరుగు సావిత్రి, స్థానిక సర్పంచ్ వెంకటలక్షుమ్మ, జెడ్పి ఉన్నతపాఠశాలలో హెచ్‌ఎం చాల్ల ఎల్లయ్య, కస్తూరిబా స్కూల్‌లో ప్రత్యేక అధికారి అరుణమ్మ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, సిఇఓ బాలనరసింహులు, పోలీసుస్టేషన్‌లో ఏఎస్‌ఐ శేషశయనరావులు జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు.