కడప

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 19: రాష్ట్రప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ఒక ప్రణాళికా బద్ధమైన కార్యక్రమాన్ని రూపొందించి శిక్షణ ఏర్పాట్లుచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.సుబ్బారావు పేర్కొన్నారు. శుక్రవారం యోగివేమన విశ్వవిద్యాలయంలోని సివి రామన్ బ్లాక్‌లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్, కరెస్పాండెంట్లంతో గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కల్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వ్యూహకల్పనపై వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణ కల్పించి వారు సులభంగా ఉద్యోగ అవకాశాలను సంపాదించుకునేలా జరుగుతుందన్నారు. ఈ ఏడాది 13 జిల్లాల్లో లక్షమంది గ్రాడ్యుయేట్లకు శిక్షణ కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే నైపుణ్య శిక్షణ ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కెవి సత్యనారాయణ మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో పోటీ ప్రపంచంలో రాష్ట్రంలో 32సెజ్‌లు ఉన్నాయన్నారు. ఇందులో ఉద్యోగ అవకాశాలు పక్క రాష్ట్రాలకే పోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.