కడప

టౌన్ ప్లానింగ్ అధికారుల అధికారానికి కత్తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 19: రాష్ట్రప్రభుత్వం మున్సిపల్ శాఖ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు అధికారాలు తొలగించింది. ఈ అధికారాలు ఓ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టింది. దీంతో ఏ పనులు లేక టౌన్ ప్లానింగ్‌విభాగం, సిబ్బంది కార్యాలయాలకే పరిమితవౌతున్నారు. 2016 ఫిబ్రవరికి ముందు మున్సిపాల్టీ, నగర పాలక సంస్థల్లో భవనాలు నిర్మించుకోవాలంటే భవన యజమాని మున్సిపాల్టీలో లైసెన్సుపొందిన సర్వేయర్ ద్వారా ప్లానింగ్ వేయించుకుని దాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులకు సమర్పిస్తారు. వారు సంబంధిత స్థలాన్ని తనిఖీ చేసి ఆ ప్లాన్‌కు తగ్గట్టుగా చలానా మొత్తాన్ని నిర్ణయిస్తారు. వారు నిర్ణయించిన చలానా మొత్తం చెల్లించిన తర్వాత భవన నిర్మాణానికి నిర్మాణ ఉత్తర్వులు జారీ చేసేవారు. ఈ వ్యవహారంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు భవన నిర్మాణదారుడు భవనాన్ని నిర్మాణం తలపెట్టినప్పటి నుంచి భవన నిర్మాణం పూర్తయ్యేంతవరకు తనిఖీ చేసేవారు. దీంతో అక్రమనిర్మాణాలు అదుపులో ఉండేవి. అయితే రాష్ట్రప్రభుత్వం ఈ పద్దతికి స్వస్తిపలికి పనులు సరళతరం అయ్యేందుకు 2016 ఫిబ్రవరినెల నుంచి ఆన్‌లైన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. అంతేగాకుండా ఈ ప్రైవేట్ కంపెనీకే ఆన్‌లైన్ వ్యవస్థను కట్టబెట్టి పూర్తి అధికారాలు కల్పించింది. అయితే అంతిమ నిర్ణయాధికారం మాత్రం టౌన్‌ప్లానింగ్ విభాగానికి కల్పించే విధంగా ఒక యాప్‌ను అమలుచేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఈ యాప్‌ను అమలు చేయలేదు. దీంతో పూర్తి అధికారాలు ప్రైవేట్ కంపెనీకే దక్కింది. దీంతో భవన నిర్మాణ యజమానులు సంబంధిత లైసెన్సు సర్వేయర్‌తో ప్లాన్ వేయించుకుని నేరుగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ దారులు సమర్పించిన దరఖాస్తులను సరిచూసి ఆన్‌లైన్ ద్వారానే చలానాలు నిర్ణయించిన మేరకే చెల్లింపులు జరుగుతున్నందున, అనంతరం ఆన్‌లైన్ ద్వారానే భవన నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతోంది. అనంతరం భవన నిర్మాణదారుడు భవనాన్ని నిర్మించుకుంటున్నారు. అయితే భవన నిర్మాణసమయంలో కానీ నిర్మించుకున్న అంతిమ సమయంలోకానీ తనిఖీ చేసే అధికారం, నిర్ణయించే అధికారం టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులకు లేకపోవడంతో భవన నిర్మాణదారులు ఇష్టానుసారంగా భవనాలు నిర్మించుకుంటూ అక్రమ భవన నిర్మాణాలకు తెరలేపుతున్నారు. దీంతో అక్రమభవన నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనివల్ల మున్సిపల్ శాఖకు ఆదాయం తగ్గుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగునిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.