కడప

అసంఘటిత కార్మికులకు వరం చంద్రన్న బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కలెక్టరేట్)ఆగస్టు 21:రాష్ట్రప్రభుత్వం అసంఘటిత కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం అసంఘటిత కార్మికులకు వరంగా మారింది. రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు దాదాపుగా 2కోట్ల మంది ఉన్నట్లు అంచనా. కడప జిల్లాలో దాదాపుగా 10లక్షల మంది అసంఘటిత కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నట్లు జిల్లా కార్మికశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న సర్వే పూర్తయితే ఎంతమంది అసంఘటిత కార్మికులు ఉన్నారో తేటతెల్లవౌతోంది. ఈ పథకం ద్వారా అసంఘటిత కార్మికులకు ఎన్నోప్రయోజనాలు ఉన్నాయి. ఈ అసంఘటిత కార్మికుల కిందకు నిర్మాణ రంగ కార్మికులు, వ్యవసాయం, అనుబంధరంగ కార్మికులు, చేతి వృత్తుల వారు, స్వయం ఉపాధి, సేవారంగం, ప్రభుత్వ పథకాల్లో గౌరవ వేతనం రూ.15వేలు లోపు ఉన్నవారు, హమాలీలు, రవాణరంగం, దుఖాణాలు, ఇతర ప్రత్యేక కేటగిరిల్లో పనిచేస్తున్న కార్మికులందరూ అసంఘటిత కార్మికులందరి కిందకు వస్తారు. చంద్రన్న బీమా పథకం ద్వారా వీరికి కింది విధంగా ప్రయోజనాలు పొందవచ్చు. కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించినా లేదా పూర్తి అంగవైకల్యం కలిగిన వారికి రూ.5లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.3లక్షల 62వేల 500లు, సహజమరణం పొందిన వారికి రూ.30వేలు లభిస్తుంది. అలాగే ఈకార్మికుల పిల్లలు 9, 10, ఇంటర్, ఐటిఐ చదువుతున్న పిల్లలకు ఇద్దరికి చొప్పున ఒక్కొక్కరికి రూ.1200 ఉపకారవేతనం మంజూరు చేస్తారు. ప్రతి అసంఘటిత కార్మికుడు ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో పాల్గొని పై పథకానికి అర్హులుగా పొంది లబ్ధిపొందాలని కార్మికవర్గాలు కోరుతున్నాయి.