కడప

తెగుళ్లబారిన మామిడి తోటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె, ఆగస్టు 21: ఎన్నో సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకున్న మామిడిచెట్లకు గూళ్లు కట్టె తెగులు రోగం పట్టి మామిడి రైతులను పట్టిపీడిస్తోంది. వివరాలలోకి వెళ్లితే.. సుమారు 15, 20 సంవత్సరాల నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మామిడి చెట్లకు గత 30 రోజుల నుండి గూళ్లు కట్టె తెగులుతో చెట్లు పూర్తిగా ఆకులు ఎండిపోయి రైతన్నలను ఆందోళనలో పడేసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా మామిడి సాగులో సుండుపల్లె మండలం అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ నుండి దేశంలోని నలుమూలలకు మామిడి పండ్లు ఎగుమతి అవుతోంది. అయితే మండలంలో సుమారు 6వేల హెక్టార్లు సాగులో ఉన్న మామిడి చెట్లు అందులోనూ రైతులు మామిడి సాగుపై అధికంగా మొగ్గు చూపడం వలన వారికి ప్రభుత్వం సహకరిస్తుండటంతో గత రెండు సంవత్సరాల్లో అధికంగా మామిడి సాగు చేశారు. అయితే ఏడు సంవత్సరాల నుండి సరైన వర్షపాతం లేక లక్షల రూపాయలు ఖర్చు చేసి బోర్లు వేయించి ట్యాంకర్లతో నీటిని తోలి మామిడిచెట్లను పెంచుకున్న రైతన్నలకు ఇప్పుడు కలవరపాటు మొదలైంది. అసలే వర్షాలు లేక పంటలు వేసుకోలేక చేసుకున్నా ఒకవైపు ఎండిపోతున్న పంటలతో కలవరపడుతుంటే ఇంతలో మామిడి చెట్లకు గూళ్లు కట్టె రోగం సోకడంతో రైతుల్లో ఆవేదన మొదలైంది. అసలే గిరిజన గ్రామాలైన మాచిరెడ్డిగారిపల్లె, ముడుంపాడు, పెద్దినేనికాల్వ గ్రామాల్లో అధికంగా మామిడి ఆకులు ఎండిపోవడం, వారి దగ్గర సరైన ఆర్థికస్థోమత కరువవుతుండటంతో మామిడి రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ఎంతో కష్టపడి పెంచుకున్న మామిడిచెట్లు ఎండిపోతుండటం, అందులోనూ గతంలో సరైన కాపులు లేక రైతన్నలు నష్టపడటంతో రైతన్నలు కోలుకోలేని స్థితిలో ఇలా జరగడం రైతుల నెత్తిన గుండు వేసినట్లయింది. ఇందుకు సరైన మార్గం చూపి రైతుల ఆవేదనను ప్రభుత్వం తీర్చాలని రైతులు కోరుతున్నారు.
సరైన మందులు అందించాలి
గత 10 సంవత్సరాల నుండి మామిడి చెట్లను కన్నబిడ్డల్లా పెంచుకుంటున్నా ఎంతటి కరువు ఎదురైనా రోజుకు వందల బిందెల నీటిని పోసి చెట్లను పెంచుతున్నాం. ఇప్పుడు మామిడి చెట్ల ఆకులు గూళ్లు గూళ్లు కట్టి ఆకుల మొత్తం ఎండిపోతున్నాయి. దీనికి సరైన మందులు ప్రభుత్వం అందజేయాలని ఆరోగ్యపురంకు చెందిన ఉత్తమ రైతు అమ్రూనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
హార్టికల్చర్ అధికారి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి వర్షాలు లేకపోవడంతో గూళ్లు కట్టె పురుగు ఆకులు గూళ్లు కట్టుకుంటున్నాయని, దీనిని నివారించేందుకు రైతులు గూళ్లను తొలగించి చెట్ల చుట్టూ క్వినాల్‌ఫాస్ మందును లేక క్లోరోపైరిపాస్ ఒక లీటర్ నీటిలో 2 మిలీ మందు కలిపి పిచికారీ చేస్తే గూళ్లు కట్టె పురుగును నివారించవచ్చని తెలిపారు.