కడప

పుష్పగిరిలో పుష్కర స్నానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వల్లూరు,ఆగస్టు 21: పవిత్రపుణ్యక్షేత్రం దక్షిణకాశి పుష్పగిరి గుండా కృష్ణమ్మ ప్రవహిస్తుండటంతో పుష్కర స్నానాలు ఆచరించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం సూర్యోదయం మునుపే భక్తులు పంచమనదీ సంగమంలో కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానాలు ఆచరించి తమ కోరికలను తీర్చాలని కోరారు. కృష్ణమ్మకు హారతి, పసుపు, కుంకుమలు సమర్పించి తమ మాంగల్యం చల్లగా ఉండాలని, అమ్మవారిని కోరారు. చిన్నారులు సైతం ఎంతో ఉల్లాసంగా కృష్ణమ్మ ఒడిలో పుష్కరస్నానం ఆచరించి క్షేత్రాధిపతి వైద్యనాదేశ్వరస్వామి, క్షేత్రపాలకులు శ్రీలక్ష్మీచెన్నకేశవస్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీకామాక్షి దేవికి పెద్ద ఎత్తున మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. చెన్నకేశవస్వామి ఆలయంలో వెలసిన సంతానమల్లేశ్వరస్వామికి, లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. పిత్రదేవతల ఆత్మశాంతించేందుకు ప్రజలు క్షేత్రంలో పిండప్రధానాలు నిర్వహించారు. రుద్రపాదం నెలకొన్న పుష్పగిరిలో పిత్రదేవతలకు పిండప్రదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం.