కడప

నీరుగారుతున్న అమృత్‌పథకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 21: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృతపథకం నీరుగారుతోంది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లను స్మార్ట్ నగరాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మన రాష్ట్రంలో దాదాపుగా 50కార్పొరేషన్లను ఈ పథకం కిందకు చేర్చారు. అందులో కడప కార్పొరేషన్ ఒకటి. అమృతపథకం నిధులు కింద కడప కార్పొరేషన్‌కు రూ.47కోట్లు కేటాయించారు. అయితే ఇందులో ప్రస్తుతం రూ.50లక్షలు విడుదల చేశారు. కడప కార్పొరేషన్‌ను స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దేందుకు మొత్తం 50 డివిజన్లలో ముఖ్యంగా ప్రజల ముఖ్య అవసరాలైన మురుగుకాలువలు, మరమ్మతులు, శుభ్రత, రోడ్లు, మంచినీటి వ్యవస్థ, విద్యుత్ వెలుగులకు తదితర ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత కల్పించారు. అందులో భాగంగా కడప కార్పొరేషన్‌కు రూ.50లక్షలు కేటాయించారు. అయితే అధికారులు మాత్రం ప్రజల ముఖ్యఅవసరాల పనులకు టెండర్లు పిలువకుండా వారికి లబ్దిచేకూర్చే పనులైన పార్కులకు టెండర్లు పిలవడంతో నగర ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభకానుండటంతో అధికారులు ముందుజాగ్రత్తగా మురుగునీటి వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని అమృతపథకం కింద ఈ పనులను చేపట్టడంలో పాలకసంస్థ అధికారులు విఫలమవుతున్నారు. అలాగే 24 గంటలు మంచినీటి వ్యవస్థను అందించడంలోనూ చొరవచూపడం లేదు. పేరుకు మాత్రమే అమృతపథకం ఆచరణలో మాత్రం నీరు గారుతోంది. ఎంతసేపు అధికారులు ప్రతి పనిలో తమ లాభానే్న చూసుకుంటున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రం చేపట్టలేదన్న విమర్శలు ప్రజల నుంచి సర్వత్రా విన్పిస్తున్నాయి.
కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో ఏ డివిజన్‌లో చూసుకున్న గుంతల గుంతలుగా రోడ్లు దర్శనమిస్తాయి. అలాగే విద్యుత్ దీపాల కొరత కూడా ఎక్కువగా ఉంది. మరి ప్రజల ముఖ్య అవసరాలైన పై వాటిని గాలికి వదిలేసి అధికారులు తమకు లాభం చేకూర్చే పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రజలకు ముఖ్య అవసరాల పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.