కడప

పచ్చదనాన్ని పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం,సెప్టెంబర్ 3: ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఒంటిమిట్ట రెంజర్, ట్రైనీ ఐఎఫ్‌ఎస్ నందినీ సలాడియా అన్నారు. మండలంలోని మాధవరం -1 గ్రామపంచాయతీలోని హ్యాపికిడ్స్ ,శ్రీచైతన్య పాఠశాలల ఆవరణంలో శనివారం గ్రీన్‌డే కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి ఒంటిమిట్ట రేంజర్, డిప్యూటీ డిఇఓ ప్రసన్నాంజనేయులు ముఖ్యఅతిధులుగా విచ్చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజ జీవితంలో విద్యార్థులు అడవుల ప్రాముఖ్యత తెలుసుకోవాలన్నారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎర్రచందనం చెట్లు ఉన్నాయన్నారు. డిప్యూటీ డిఇఓ ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 11శాతం మాత్రమే అడవులు ఉన్నాయని, వాటిని 23శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారన్నారు. అందుకోసమే రాష్టవ్య్రాప్తంగా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటాలన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు 47కోట్లు ఉన్నజనాభా ప్రస్తుతం 120కోట్లకు చేరిందని , భవిష్యత్ తరాలకు ఉన్న వనరులు అందజేసేందుకు చెట్లను నాటాలన్నారు. కరస్పాండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ త్రివేణి సంగమంలా టీచర్స్‌డే , వినాయచవితి, గ్రీన్స్‌డే మూడు పండుగలు ముందస్తుగా పాఠశాలలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈసందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ముందస్తుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులు ఏర్పాటుచేసిన నల్లమలఫారెస్టు, జంతువులు, చెట్లు స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల డైరెక్టర్ శివకుమారి, హ్యాపికిడ్స్ ప్రిన్సిపల్ సుమతి, వైస్ ప్రిన్సిపల్ శ్రీరాములు పాల్గొన్నారు.