కడప

పెన్నానదిలో పడి బాలిక మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం, సెప్టెంబర్ 8:కడప నగరం చిన్నచౌకుకు చెందిన ఆకుల చంద్రిక (6) అనే బాలిక బుధవారం నిమజ్జన కార్యక్రమానికి వచ్చి పెన్నాలో పడి మృతి చెందింది. తల్లితోపాటు చంద్రిక అనే బాలిక నిమజ్జనం కార్యక్రమానికి వచ్చారు. తన తల్లి పెన్నానదిలో ఉండటంతో బాలిక కూడా పెన్నానదిలోకి దిగింది. దీంతో నీటి ప్రవాహానికి బాలిక కొట్టుకుని పోయింది. కొద్దిసేపటి తర్వాత కుమార్తెకోసం గాలించినా కన్పించలేదు. గురువారం ఉదయం పెన్నా హైలెవల్ వంతెన పక్కన శవమై తేలింది. ఈమేరకు జాలర్లు బాలికశవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయాన్ని తెలుసుకున్న ఎస్‌ఐ లింగప్ప సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈమేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ
ఖాజీపేట, సెప్టెంబర్ 8:మండలంలో బుడ్డాయపల్లె జాతీయ రహదారి వద్ద గురువారం మధ్యాహ్నం పొట్టు తరలిస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీ కొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చెన్నూరు మండలం కొండపేటకు చెందిన ట్రాక్టర్ పొట్టులోడుతో వెళ్తుండగా బుడ్డాయపల్లె జాతీయ రహదారిపై వెనుకవైపు నుంచి వచ్చిన లారీ వేగంగా వచ్చి ఢీ కొంది. ట్రాక్టర్ ,ట్రాలీ విడిపోయి రోడ్డుకు అడ్డంగా పడటంతో వరిపొట్టు రోడ్డుకు అడ్డుపడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామానికి సమీపంలో ప్రమా దం జరగడంతో యువకులు పరుగున వచ్చి ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన నారాయణరెడ్డి, జయరాముడులను బయటకు తీశారు. మరో ఇద్దరిని అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. సంఘటన స్థలాన్ని ఏఎస్‌ఐ సుబ్బారావు, హెడ్‌కానిస్టేబుల్ రామసుబ్బారెడ్డిలు సందర్శించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.