కడప

11న తిరుపతిలో నూతన కథల సంపుటి ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, సెప్టెంబర్ 8: జిల్లాకు చెందిన కథారచయిత, అభ్యుదయ కవి వేంపల్లి రెడ్డినాగరాజు రచించిన బొమ్మ- బొరుసు నూతన కథలసంపుటి ఆవిష్కరణ ఈ నెల 11న ఆదివారం తిరుపతిలో జరగనుంది. చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో తిరుపతిలోని గంధమనేని శివయ్య మెమోరియల్ భవన్‌లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సాహిత్య సభలలో ఈ కథల సంపుటిని ఆవిష్కరిస్తారు. సంబేపల్లె మండల కేంద్రానికి చెందిన రెడ్డినాగరాజు స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గత పాతికేళ్లుగా ప్రవృత్తిగా రచనలు చేస్తున్న ఈయన ఇప్పటి వరకు నిచ్చెనమెట్లు, రమణీయకథలు, నేను నా బాశాలి కథ సంపుటాలను, మట్టివాసన పేరిట కవితా సంపుటిని వెలువరించారు. విభిన్న సామాజిక అంశాలు ఇతివృత్తాలుగా రెడ్డినాగరాజు రచించిన వందల కథలు ప్రముఖ దిన, వారపత్రికలలో ప్రచురితమవ్వడంతో పాటు వివిధ ఆకాశవాణి కేంద్రాల ద్వారా కూడా ప్రసారమయ్యాయి. కొన్ని అంతర్జాల పత్రికలలో, విశేష సంచికలలో ప్రచురితమైన కథ లు రచయితగా రెడ్డినాగరాజుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. సందేశాత్మక విలువలతో ఈయన రచించి వెలువరించిన బాలసాహిత్యం, బా మ్మలు చెప్పని కమ్మని కథలు సంపుటి సాహితీలోకంలో విమర్శకుల ప్రశంసల్ని, పలువురు ప్రముఖుల సన్మాన, సత్కారాలు పొందేలా చేయడమే కాక మిగతా ఇతర భారతీయ భాషల్లోకి అనువదింపబడటం ఈ రచయిత ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నూతన కథల సంపుటి బొమ్మ-బొరుసు కథల సంపుటి ప్రచురణకు ఆర్థికసాయం అందజేసింది. కాగా జిల్లాకు చెందిన రచయిత నూతన కథల సంపుటిని పొరుగు జిల్లా రచయితల సమాఖ్య ఆవిష్కరించనుండటం గొప్పదనంగా సాహితీవేత్తలు, కళాకారులు భావిస్తున్నారు. ఈ తరహా ఘనతను పొందిన రచయిత రెడ్డినాగరాజు సాహితీ సేవలను పలువురు ప్రశంసించారు.