కడప

ఉనికి కోసమే వైకాపా ఆరాటం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 9: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా పేరిట బంద్‌కు పిలుపునిచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి టెలిఫోన్ ద్వారా విలేఖర్లతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ తొలి నుంచి ప్రత్యేక హోదానే కోరుకుంటోందని రాష్ట్రప్రజల కోరిక మేరకే ప్రజలకోసం పనిచేసేది తమ ప్రభుత్వమని, వైకాపా ప్రజల్లో తమ ఉనికి కోల్పోయి కనుమరుగవుతుందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా వైకాపా అధినేత జగన్ మతిభ్రమించి అధికారదాహంతో తన స్వార్థ ప్రయోజనాలకోసం పవిత్ర దేవాలయమైన శాసనసభ, శాసన మండలిపై గౌరవం లేదని మార్షల్స్, స్పీకర్‌పై దాడియత్నం చేయడం దురదృష్టకరమని వారి నడవడికే సమాజానికి చీడ అని ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని, రౌడీలు, గూండాలు, అక్రమార్కులు, కాలం చెల్లిన నాయకులు కూడా ప్రజాప్రతినిధులు కావడం ప్రజల దౌర్భాగ్యమని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. అధికారం కోసం ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ప్రజలందరికీ తెలుసునని గుర్తు చేశారు. గతంలో రాష్టవ్రిభజన సమయంలో మొద్దునిద్రలో ఉన్న వైకాపా, తమ అధినేత చంద్రబాబు ఢిల్లీలో ఏపి భవన్‌లో నిరాహారదీక్ష చేపడితే ఆనాడు కూడా విమర్శలు చేశారని తాము ఎప్పుడూ ప్రజాసంక్షేమం కోసం ప్రశాంతత కోసం, అభివృద్ధికోసం కృషి చేస్తామేతప్ప ప్రజా వ్యతిరేక విధానాలకు ఏనాడూ పాల్పడలేదన్నారు. వైకాపా నేతలు సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలను రెచ్చగొట్టి నాటి ప్రభుత్వంతో ఎటువంటి సంప్రదింపులులేక తీవ్రంగా నష్టపోయామని కేంద్రంతో తమనాయకుడు ప్రత్యేక హోదా కోసం అనేక మార్లు సంప్రదింపులుచేసి ఒక దశలో కేంద్రంపై అసహనం కూడా వ్యక్తం చేశారు. మిత్రపక్షమైన తమ మద్దతులేకున్నా కేంద్రం పాలించే సత్తా ఉన్నా కేవలం ప్రత్యేకహోదా కోసం తమ నాయకుడు రాజీలేని పోరాటం కొనసాగించారని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్యాకేజిని ప్రకటించారని ప్యాకేజిని వినియోగించుకుంటూ కేంద్రంతో సంప్రదింపులు చేస్తూ ప్రత్యేకహోదాకోసం అన్ని పార్టీలు మూకుమ్మడిగా ప్రయత్నాలు కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీనావస్థలో ఉన్నా ఉన్న నిధులతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతూ నూతన రాజధాని నిర్మిస్తూ, ఇప్పుడిప్పుడే పాలనను గాడిలోకి తెచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో తమ ప్రభుత్వానికి ఉండేందుకు మరో ఏడేళ్లు పైబడి గడువున్నా పరిపాలన సజావుగా జరిగి మంత్రులు, అధికారులు, ఉద్యోగులు అందుబాటులో ఉండేందుకే హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలించడం, ఉద్యోగులు సహకరించడం జరుగుతోందని ,ప్రస్తుతం ప్రత్యేక ప్యాకేజిని వ్యతిరేకిస్తూ ప్రజలకు నష్టం వాటిల్లుతుందని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసి రాజకీయ లబ్దికోసమే వైకాపా బంద్‌లు, నిరసనలు చేపడుతోందని రాష్టవ్రిభజనతో సిఎం బాబు పరిపాలనాధ్యక్షుడని పూర్తిస్థాయిలో మెజార్టీని ప్రజలు అప్పగించారని ఇప్పటికైనా జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.