కడప

ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 11: ప్రతిపక్షాలు, వామపక్షాలు ప్రత్యేకహోదా గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికీలేదని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు తొలి నుంచి హోదానే కోరుతున్నారని మరో రెండున్నర ఏడాది వరకు ఎటువంటి ఎన్నికలు లేవని కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై బురదజల్లే పనిగా పెట్టుకున్నారని అది ఏమాత్రం సబబుకాదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి హితబోధ చేశారు. ఆదివారం ఆయన జిల్లా పర్యటన సందర్భంగా స్టేట్ గెస్ట్‌హౌస్‌లో విలేఖర్లతో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కేంద్రంలో తమ ఎంపిలు ఉన్న సంఖ్య అంతంతమాత్రమేనని, రాష్ట్రంలో 10సంవత్సరాలు కాంగ్రెస్‌పాలన ఉన్నిందని ఆనాడు తల్లికాంగ్రెస్ , పిల్లకాంగ్రెస్ ఏకమై వామపక్షాలుసైతం ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసి తెలుగుప్రజల జీవితాల్లో చీకటి నింపిన ఘనత వారిదేనని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే ప్రత్యేకహోదా ముఖ్యమేనని కేంద్రం ప్రత్యేక ప్యాకేజిపై తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం ప్రభుత్వం సంబరపడలేదని అభివృద్ధికి నిధులు అవసరమని , రాష్ట్రంలో ఆర్థికలోటుతో ఆశించిన అభివృద్ధి చేయలేకపోతున్నామని ఆయన గుర్తుచేశారు. ప్రత్యేకహోదా సాధనకోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పార్టీ కేడర్ కృషి చేయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ , అవినీతి ఆరోపణలు చేస్తూ పనిగట్టుకున్నారని అది మంచిపద్ధతి కాదన్నారు. కాంగ్రెస్‌పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో కొంతమంది తల్లికాంగ్రెస్, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితులుగా ఉంటున్న వారి సలహాలు తీసుకుని తన అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రత్యేకహోదా పేరిట ప్రజల్లోకి వచ్చేందుకు పడుతున్న తపన అది తపనకాదని అధికార స్వార్థ దాహమని ఆయన ఆరోపించారు. వామపక్షాలు కూడా ప్రతిపక్ష నేతకు ఊతమివ్వడం సరైన పద్ధతికాదని ఆయన విచారం వ్యక్తం చేశారు. జనసేన నేత పవన్‌కల్యాణ్ తన ఆక్రోశాన్ని వెళ్లబుచ్చడంలో తప్పులేదని , అయితే బాబుపై ఆరోపణలు చేయ డం తగదన్నారు. సిద్దాంతాలు కలిగిన నేతలు ఉద్యమాలు చేస్తే ప్రజలు హర్షిస్తారని, అవినీతి అక్రమాల ఊబిలో కూరుకుపోయి లక్షలకోట్లరూపాయలు దోచుకుని , జన్మభూమిని కూడా పట్టించుకోని నేతలు బాబు విమర్శించే హక్కులేదని ,హోదాకోసం ప్రజలను రెచ్చగొట్టకుండా శాంతియుతంగా పోరాడితే ప్రజలు మద్దతిస్తారని ప్రత్యేకహోదా సాధించేందుకు నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.