జాతీయ వార్తలు

డిడిసిఎ కుంభకోణంలో కాంగ్రెస్ నేతలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాక్ష్యాధారాలు ఉన్నాయి
అందరినీ కోర్టుకీడుస్తా
కీర్తి ఆజాద్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) వ్యవహారాల్లో ఎటువంటి కుంభకోణం జరిగినట్లు ఎస్‌ఎఫ్‌ఐఓ (సీరియస్ ఫ్రాడ్ ఇనె్వస్టిగేషన్ ఆఫీస్) దర్యాప్తులో తేలలేదని బిజెపి చేస్తున్న వాదనను ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన పార్లమెంట్ సభ్యుడు, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ తోసిపుచ్చారు. ఈ వ్యవహారంపై సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సహా కేంద్ర సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన సోమవారం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో తాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని టార్గెట్ చేయడం లేదని కీర్తి ఆజాద్ స్పష్టం చేశారు. డిడిసిఎలో అవినీతికి పాల్పడిన వారిపై గత యుపిఎ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, డిడిసిఎలో డైరెక్టర్లుగా ఉన్న రాజీవ్ శుక్లా, నవీన్ జిందాల్, అర్వీందర్ సింగ్ లలీ పలువురు యుపిఎ నామినీలు ఈ అవినీతిలో పాలుపంచుకోవడమే ఇందుకు కారణమని కీర్తి ఆజాద్ పేర్కొంటూ, వీరిందరినీ కోర్టుకు ఈడ్చేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఎటువంటి పరిశీలనలు, జాగ్రత్తలు లేకుండానే డిడిసిఎ నుంచి కోట్లాది రూపాయలను నకిలీ చిరునామాలతో ఉన్న బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారని, ఒక పని చేసిన వ్యక్తులకే మళ్లీ మళ్లీ చెల్లింపులు జరిపి తీవ్రమైన కుంభకోణానికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని కీర్తి ఆజాద్ స్పష్టం చేశారు.