జాతీయ వార్తలు

దిల్లీలో రాష్టప్రతి పాలనకు కుట్ర: కేజ్రివాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ తరహాలే దిల్లీలోనూ రాష్టప్రతి పాలన విధించేందుకు కేంద్రం పారిశుద్ధ్య కార్మికులను ఉసిగొలిపి సమ్మె చేయిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దిల్లీ మున్సిపల్ కార్మికుల జీతాలకు సంబంధించి ప్రభుత్వం బకాయిలేమీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఆరునెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని, తక్షణం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు. బుధవారంనాడు వందలాది మంది కార్మికులు ర్యాలీలో పాల్గొని పలు కీలక ప్రాంతాల్లో రోడ్లపై చెత్తపారబోసి తమ నిరసన తెలిపారు. కాగా మున్సిపల్ పాఠశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికూడా పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించడం విశేషం.