జాతీయ వార్తలు

ఆనందీబెన్ వైఖరితో ప్రజాస్వామ్యానికి చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉండగా బహిరంగ సభలపై ఆంక్షలు విధించి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని దిల్లీ సిఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గుజరాత్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆయన శనివారం సోమనాథ దేవాలయం వద్ద సమరశంఖం పూరించారు. రాజ్‌కోట్ చేరుకున్న తర్వాత ఆయన సోమనాథ ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆదివారం నాడు సూరత్‌లో ఆమ్ ఆద్మీపార్టీ సభను రద్దు చేసేలా స్థానిక వ్యాపారవేత్తలపై ముఖ్యమంత్రి ఒత్తిడి తెచ్చారని కేజ్రీవాల్ విమర్శించారు. గుజరాత్‌లో ఆప్ ఎదుగుదలను సహించలేకే ఆమె ఈ చర్యకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చూపుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.