అంతర్జాతీయం

కెన్యాలో మోదీకి ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైరోబి:కెన్యాతో భారత్‌కు వందల ఏళ్ల అనుబంధం ఉందని, భారత్‌నుంచి దశాబ్దాల క్రితం కూలీలుగా వలసవచ్చినవారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేశారని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కెన్యా పర్యటనకు వచ్చిన ఆయనకు నైరోబీ విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. ఆ దేశ అధ్యక్షుడు ఉసూరు కెన్యట్టా మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ సైనికవందనం స్వీకరించారు. అనంతరం ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. కెన్యాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. తను ప్రధానిగా ఎన్నికైనప్పుడు విపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయని, విదేశాంగ విధానాల గురించి ఏమీ తెలియదన్నారని గుర్తు చేశారు. అందులో నిజమున్నా తాను ఎంతో నేర్చుకున్నానని, గత రెండేళ్లుగా సుపరిపాలన అందించానని ఆయన చెప్పారు. దాదాపు 20వేలమంధి ఎన్‌ఆర్‌లు మోదీకి అడుగడుగునా నీరాజనం పట్టారు.