అంతర్జాతీయం

సాకారమైన సింగపూర్‌ భేటీ : ట్రంప్‌, కిమ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్‌:: సింగపూర్‌ భేటీ సాకారమైందని, ఈ సమావేశం ద్వారా చాలా పురోగతి చోటుచేసుకుందని శాంతి స్థాపనకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్నట్లు అని ట్రంప్‌ కిమ్‌ పేర్కొన్నారు. అమెరికా, ఉత్తరకొరియా దేశాధ్యక్షుల కీలక సమావేశం సింగపూర్‌లోని కేపెల్లా హోటల్‌లో జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు దాదాపు 38 నిమిషాల పాటు ముఖాముఖి సమావేశమయ్యారు. అనంతరం తమ దౌత్యాధికారులతో కలిసి ద్వైపాక్షిక చర్యలు జరిపారు. తొలిసారిగా కలుసుకున్న సందర్భంగా ట్రంప్‌, కిమ్‌ కరచాలనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ చాలాసేపు చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తర్వాత తమ జాతీయ జెండాల వద్ద నిల్చొని ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం ట్రంప్‌.. హాలువైపు కిమ్‌కు దారి చూపించారు.