జాతీయ వార్తలు

కేరళలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ క్లీన్‌స్వీప్ దిశగా వెళుతుంది. దాదాపు ఇక్కడ 20 లోకసభ స్థానాలు ఉండగా 19 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి మంచి వ‌య‌నాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. సుమారు 8 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. తిరువనంతపురంలో కేంద్రమంత్రి శశిథరూర్ ఆధిక్యంలో ఉన్నారు. అధికార ఎల్‌డీఎఫ్ ఇక్కడ చతికిల పడింది. ఈ కూటమికి ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. కేరళలో 2014 ఎన్నికల్లోనూ యూడీఎఫ్ గెలుపు దిశగా పయనించింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఒకటి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) మరొక స్థానంలో విజయం సాధించాయ. కాంగ్రెస్ 8 సీట్లలో విజయం సాధించింది. ఈసారి ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ చేసిన విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు. అంతేకాదు కనీసం శబరిమల అంశం వల్లనైనా ఓట్లు రాలతాయని భావించినా సాధ్యం కాలేదు. మోదీ ప్రభంజనం సైతం పనిచేయలేదు. ఒక్క స్థానాన్ని సైతం కైవసం చేసుకోలేకపోయంది. కాగా కాంగ్రెస్ హవా ముందు అధికార ఎల్‌డిఎఫ్ సైతం తన ఓటమిని అంగీకరించక తప్పలేదు.