కృష్ణ

కైకలూరులో ఆగని క్యాట్‌ఫిష్ రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు : కైకలూరు నియోజకవర్గంలో క్యాట్‌ఫిష్ అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా రాష్టమ్రంత్రి కామినేని శ్రీనివాస్ క్యాట్‌ఫిష్ రవాణాపై ఉపేక్షించవద్దు, క్యాట్‌ఫిష్‌ను రవాణా చేసే వారు ఎంతటి వారైనా సరే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులు, రెవిన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసి క్యాట్‌ఫిష్‌ను సాగుచేసే వారిని హెచ్చరించినా మార్పు రావడం లేదు. క్యాట్‌ఫిష్ రవాణా సిరులు కురిపిస్తుండటంతో కైకలూరు ప్రాంతంలో కొంతమంది నిత్యం క్యాట్‌ఫిష్‌ను దేశంలోని పలు ప్రాంతాలకు రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా కైకలూరు రూరల్ పోలీసుల వలలో చిక్కుకున్న క్యాట్‌ఫిష్ ఉదంతాన్ని పరిశీలిస్తే ఇది రుజువవుతుంది. వివరాల్లోకెళితే మండలంలోని పెదకొట్టాడ గ్రామం నుండి హైదరాబాద్‌కు లారీలో తరలిస్తున్న నిషేధిత క్యాట్‌ఫిష్‌ను బుధవారం తెల్లవారుజామున రూరల్ ఎస్‌ఐ రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. లారీని, లారీ డ్రైవర్‌ను ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆలపాడు వద్ద వివిధ వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో 4 టన్నుల లైవ్ క్యాట్‌ఫిష్‌ను తరలిస్తుండగా పట్టుకున్నారు. క్యాట్‌ఫిష్ పట్టివేతపై ఎస్‌ఐ రంజిత్‌కుమార్ తహశీల్దార్ కెఏ నారాయణరెడ్డి, ఆర్‌ఐ ఎం రామ్‌శ్రీనివాస్, విఆర్‌వోలకు సమాచారం ఇచ్చి లారీ క్యాట్‌ఫిష్ రవాణాదారులను అదుపులోకి తీసుకున్నారు. పెదకొట్టాడకు చెందిన ఘంటసాల రవి, హైదరాబాద్‌కు చెందిన టింగ్‌లిక్కర్ లక్ష్మణ్ అనే ఏజెంటు ద్వారా క్యాట్‌ఫిష్‌లను హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు పక్కా నిఘా పెట్టడంతో క్యాట్‌ఫిష్ రవాణాదారులు దొరికిపోయారు. క్యాట్‌ఫిష్ ఎగుమతి, దిగుమతిదారులతో పాటు లారీ డ్రైవర్ సుంకంబుల్ రవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రంజిత్‌కుమార్ తెలిపారు. రవాణా చేస్తున్న క్యాట్‌ఫిష్‌లను ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉప్పుటేరు సమీపంలో భూమిలో ఖననం చేశారు.