ఆటాపోటీ

ఖలీ ఆధ్వర్యంలో సిడబ్ల్యుఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్‌లో పాల్గొన్న తొలి భారతీయుడు ‘ది గ్రేట్’ ఖలీ ఆధ్వర్యంలో కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైనె్మంట్ (సిడబ్ల్యుఇ) ఆరంభమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఫైట్స్‌ను ఉత్తరాఖండ్‌లో నిర్వహించేందుకు ఖలీ సన్నాహాలు చేస్తున్నాడు. రెజ్లింగ్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు జరిగిన ప్రయత్నమే ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్. అందులో రెజ్లర్లు ఒకరినొకరు రక్తాలు కారేలా కొట్టుకోవడం, బలంగా గాయపరచడం, ఎత్తి నేలకు కొట్టడం వంటి చర్యలన్నీ కృత్రిమమైన స్టంట్సేగానీ నిజం కాదని అందరికీ తెలుసు. కానీ, ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ఏడు అడుగుల ఒక అంగుళం పొడవుతో చిన్నసైజు పర్వతంలా కనిపించే దలీప్ సింగ్ రాణా ప్రపంచ ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్‌లో ఖలీ పేరుతో సుపరచితుడు. అతని కారణంగానే మన దేశంలోనూ డబ్ల్యుడబ్ల్యుఇ రెజ్లింగ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దేశంలో అతను మొదలుపెట్టబోయే సిడబ్ల్యుఇ రెండు రోజుల రెజ్లింగ్ పోటీలు యువతను ఆకట్టుకోవడం ఖాయం.