ఖమ్మం

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, సెప్టెంబర్ 23: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసి నియంతృత్వ విధానాలతో రాష్ట్రంలో పాలన సాగించి ముందుస్తు ఎన్నికల్లో తిరిగి అధికార కైవానికి కుటిల యత్నాలు చేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమని కాంగ్రెస్ ఇల్లందు నియోజక వర్గ నాయకుడు భూక్య రాంచంద్రునాయక్ అన్నారు. నాలుగేళ్ళ పాలనలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ చేసిన హామీలు, వైఫల్యాలపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన ప్రచారపత్రాన్ని ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ అధికారం ఉందనే అహంతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు సాగిస్తున్న చర్యలకు అంతుపొంతు లేకుండా పోయిందని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్, పేదలకు డబుల్ బెడ్ రూంలు, పెన్షన్లు, దళితులకు మూడెకరాల భూమి, అన్నదాతలకు పంట గిట్టుబాటు ధర అందని ద్రాక్ష అయిందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అనుసరిరించిన విధానాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు వివరించిన కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులను చేయాలని రాంచంద్రునాయక్ కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లందు ఎ బ్లాక్ అధ్యక్షుడు దనియాకుల రామారావు, మండల కమిటీ అధ్యక్షుడు పానుగుంటి రాధాకృష్ణ, మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు తాళ్ళపల్లి క్రిష్ణాగౌడ్, మండారాముగౌడ్, చిలకబాబు, ఎద్దురవి తదితరులు పాల్గొన్నారు.

సీపీఎంను గెలిపించడం చారిత్రక అవసరం
ఖమ్మం, సెప్టెంబర్ 23: ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల పక్షాన రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసేందుకు ఈ ఎన్నికల్లో సీపీఎంను గెలిపించడం చారిత్రక అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్యభవన్‌లో జరిగిన వైరా నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు, పేదలు దశాబ్దాల కాలంగా సాగు చేస్తున్న పోడు భూములను టీఆర్‌ఎస్ పాలకులు లాక్కోవాలని కుట్ర చేసి అడ్డుకున్న వారిని జైలుకు పంపారన్నారు. అటవీహక్కుల చట్టం ద్వారా హక్కు పత్రాలు పొందిన గిరిజనులు, పోడు రైతులకు అండగా నిలిచిన సీపీఎం పట్ల సానుకూలంగా ఉన్నారన్నారు. వైరా చెరువు ఆయకట్టు ప్రాంత భూములకు సాగునీరు అందించాలని చేసిన పోరాటాల ఫలితంగానే ప్రస్తుతం నీరు అందుతుందని గుర్తు చేశారు. జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించిన ఘనత సీపీఎందేనని, వైరా నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోనూ సీపీఎం బలమైన శక్తిగా ఉందన్నారు. సీపీఎం గెలిస్తే నియోజకవర్గ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈనెల 28వ తేదీన నియోజకవర్గస్థాయి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని, అందులోనే ఎన్నికల ప్రణాళికలను కూడా బహిర్గతం చేస్తామన్నారు. సమావేశంలో వైరా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కల్యాణ వెంకటేశ్వరరావు నాయకులు రాంబాబు, శ్రీనివాసరావు,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.