ఖమ్మం

ఎన్నికల బరి.. మావోల గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి * హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు
భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 23: ముందస్తు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ఇప్పుడు సరికొత్త టెన్షన్ మొదలైంది. కొంతకాలం నుంచి స్తబ్ధుగా ఉన్న మావోయిస్టులు పొరుగున ఉన్న ఆంధ్రాలోని విశాఖ మన్యంలో అధికార పార్టీ శాసనసభ్యుడిని, మాజీ శాసనసభ్యుడిని అత్యంత దారుణంగా హతమార్చడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రాజకీయ పార్టీ నేతల్లో భయాందోళన కలిగించింది. ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైన తరుణంలో తెరాస అభ్యర్థులు, మిగతా పార్టీల్లో సీట్లు ఆశిస్తున్న వారు తమ తమ నియోజకవర్గాల్లో 10 రోజుల నుంచి విస్తృత పర్యటనలు చేస్తున్నారు. గత మూడునెలల నుంచి మావోయిస్టులు స్తబ్ధుగా ఉండటంతో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో వారు ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం విశాఖలో జరిగిన ఘటనతో వీరంతా అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం గతంలో కంటే తక్కువగానే ఉన్నా పలుమార్లు వారు తమ ఉనికిని చాటుకున్నారు. గత 8 నెలల కాలంలో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీ క్యాడర్‌గా తీవ్రంగా నష్టపోయింది. దీంతో వారు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని, ఏ క్షణమైనా దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్‌వర్గాలు అంచనా వేస్తూ వచ్చినా అటువంటి ప్రమాదమేమీ రాలేదు. ఈ తరుణంలో ముందస్తు ఎన్నికల సందడి మొదలు కాగా అన్ని పార్టీల నేతలంతా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. విశాఖ ఘటనతో పర్యటనల్లో ఉన్న వారంతా ఆదివారం వెనక్కి తిరిగొచ్చేశారు. ఆంధ్రాలో జరిగిన ఘటన దరిమిలా తెలంగాణలోనూ హైఅలర్ట్ ప్రకటించడంతో పోలీసులు పర్యటనల్లో ఉన్న నేతలను అప్రమత్తం చేశారు. ఇంతకాలం చోటామోటా నేతలను టార్గెట్ చేసిన మావోయిస్టులు కనివినీ ఎరుగని రీతిలో ఏకంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చడంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాలంటేనే జిల్లాలోని నేతలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. ఇటీవల చర్ల మండలం కుర్నపల్లి గ్రామస్తులను మావోయిస్టులు దారుణంగా కొట్టారు. ఎన్నికల సీజన్ కావడంతో అభ్యర్థులే కాకుండా ఆయా పార్టీల్లోని కీలక నేతలు కూడా గ్రామాల్లో ప్రచారానికి వస్తారు. వరుస ఎన్‌కౌంటర్లతో బలహీన పడిన మావోలు తమ ఉనికిని చాటుకునేందుకు, బలపడేందుకు నేతలను కిడ్నాప్ చేయడం, హతమార్చడం వంటి సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని పార్టీల నేతలను అప్రమత్తం చేసి హెచ్చరికలు జారీ చేశారు. తమకు సమాచారం లేకుండా పర్యటనకు వెళ్లవద్దని సూచించిన పోలీసులు ఆయా పార్టీల్లోని రాష్ట్ర స్థాయి నేతల పర్యటనకు కూడా రద్దు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

అంతటా అప్రమత్తం...
విశాఖ ఘటన నేపథ్యంలో పోలీసుశాఖ మరింత అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై యాంటీ నక్సలైట్ విభాగం ముందుగానే నిఘాను పెంచగా ఆంధ్రాలో జరిగిన ఘటనతో రాష్ట్రానికి ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో మరింతగా అప్రమత్తంగా ఉండాలని సంబంధిత జిల్లాల ఎస్పీలను నిఘా విభాగం అంతర్గతంగా హెచ్చరికలు పంపింది. ఎన్నికల సీజన్ కావడంతో ప్రచారానికి వెళ్లే వీఐపీల రక్షణ విషయంలో పోలీసులు ఇప్పుడు మరింత అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా మావోయిస్టుల టార్గెట్‌లో ఉన్న రాజకీయ ప్రముఖులు మొదలుకొని స్థానిక నాయకుల వరకు వారి భద్రత విషయంలో ముందస్తు జాగ్రత్తలను కూడా నిఘా విభాగం సూచించినట్లు సమాచారం. మావోయిస్టులకు కుంచకోట అయిన ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా మావోలు చొరబడే అవకాశం ఉందని, రాజకీయ నాయకులను వారు టార్గెట్ చేస్తారని భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాల ఎస్పీలతో పాటు పోలీసు కమిషనర్‌లను నిఘా విభాగం తాజా ఘటనతో మరింత అప్రమత్తం చేసింది. అంతేకాక కిందిస్థాయి పోలీసు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. రాజకీయ పార్టీల హడావుడి, ప్రచార సభలు, ర్యాలీలకు బందోబస్తు ఇస్తూ ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మావోయిస్టుల ద్వారా ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో మావోయిస్టులకు పట్టున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అదే సమయంలో సరిహద్దులు దాటి భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి మొదలైన ప్రభావిత జిల్లాల్లోకి మావోయిస్టులు ప్రవేశించకుండా గట్టి నిఘా వేసి ఉంచేలా చర్యలకు ఉన్నతాధికారులు ఉపక్రమించారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో సాయుధ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్లను నిరంతరం కొనసాగించాలని అధికారులు ఆదేశించారు. అలాగే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నిఘా విభాగాలతో సమన్వయాన్ని పెంచుతూ చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండటంతో సరిహద్దుల్లోని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలు మావోయిస్టుల కార్యకలాపాలపై ప్రత్యేకించి నిఘా వేసి ఉంచాలని కేంద్ర హోంశాఖ సైతం హెచ్చరికలు జారీ చేసింది.