ఖమ్మం

రహదారి పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో చేపడుతున్న జాతీయ రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత సమయంలో వాటిని పూర్తిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం తన నివాసంలో జాతీయ రహదారుల నిర్మాణం, భూసేకరణ పనులపై జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసేకరణ పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో పనులలో జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. భూసేకరణ పూర్తిచేసి అవార్డు అయిన భూములను నిర్మాణ ఏజెన్సీలకు అప్పగించాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఖమ్మం-దేవరపల్లికి సంబంధించిన భూసేకరణను కూడా త్వరతిగతిన పూర్తిచేయాలని సూచించారు. ఖమ్మం-వరంగల్ రహదారి విస్తరణ పనులకు అమోదం లభించిందని ఆ పనులను పూర్తిచేయాలన్నారు. అంతరాష్ట్రాల గుండ వెళ్ళే మంచిర్యాల- వరంగల్-కంచికచర్ల జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్ పరిధిలో చేర్చడంపట్ల అభినందించారు. ఈ రహదారిని విస్తరించేందుకు అవసరమైన ప్రతిపాదనలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖమ్మం-కోదాడ, ఖమ్మం-సూర్యాపేట రహదారులు పనులకు టెండర్లు పిలిచారని వాటి పనులను కూడ త్వరతిగతిన చేపట్టి పూర్తిచేయాలన్నారు. సమావేశంలో జాతీయ రహదారులు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.