ఖమ్మం

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే వరకు పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, సెప్టెంబర్ 24: జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు వచ్చేంత వరకు పోరాటం చేస్తామని ఐజెయు రాష్ట్ర నాయకులు రాంనారాయణ, జిల్లా అద్యక్షులు నర్వనేని వెంకట్రావు, జిల్లా నాయకులు మైసా పాపారావు, మాధవ్‌లు పేర్కొన్నారు. మధిర ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఇళ్ళ స్థలాల కోసం జర్నిలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా ప్రజా సమస్యలను వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు సాధించేంతవరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పలు సందర్భాల్లో జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామని మాట ఇచ్చారని ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తొలిరోజు దీక్షలో కూర్చున్నవారిలో జర్నిలిస్టులు జి.వెంకటేశ్వర్లు(జివి), రాము, మువ్వా రామకృష్ణ, సాదినేని నరసింహరావు, దోర్నాల వేణు, పబ్బతి జగదీష్, ఎడవల్లి శ్రీ్ధర్‌లు ఉన్నారు. జర్నలిస్టులు చేస్తున్న దీక్షలకు పలువురు సంఘీభావం తెలిపారు.