ఖమ్మం

మణుగూరు తహశీల్దార్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణుగూరు, సెప్టెంబర్ 24: మణుగూరు తాహశీల్దార్ నాగప్రసాద్‌ను ఆరు నెలలపాటు విధుల నుంచి తొలగిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజిత్‌కుమార్‌శైనీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గత శనివారం తాహశీల్దార్‌కు షోకాజు నోటీసు జారీ చేసిన కలెక్టర్ సోమవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. మణుగూరు తాహశీల్దార్‌గా పనిచేస్తున్న నాగప్రసాద్ విధుల్లో చేరిన దగ్గర్నుంచి వివాదాలలో చిక్కుకున్నారు. సీసీఎల్‌ఏ నుంచి మణుగూరుకు పోస్టింగ్‌పై వచ్చిన నాగప్రసాద్ మండలంలో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఆయన తాహశీల్దార్‌గా పనిచేస్తున్న కాలంలో పలు అక్రమాలకు పాల్పడుతూ మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తాహశీల్దార్‌ను సీసీఎల్‌ఏకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో నాగప్రసాద్ హైకోర్టును ఆశ్రయించి తనను అకారణంగా సరెండర్ చేశారని పిటిషన్ వేశారు. కోర్టు ఉత్తర్వులతో తిరిగి మణుగూరు తాహశీల్దార్‌గా విధుల్లో చేరారు. తాజాగా ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభియోగంతో నూతన కలెక్టర్ ఆయనను ఆరు నెలల పాటు విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.