ఖమ్మం

రైతుల కోసం ఉప మార్కెట్ యార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, సెప్టెంబర్ 24: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఏన్కూరు కేంద్రంగా వ్యవసాయ మార్కెట్ కమిటీని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత పాతికేళ్లకాలంగా పత్తి సేద్యంతోపాటు దిగుబడుల సాధనలో సైతం మండల రైతులు ప్రత్యేకత సాధించారు. పర్యవసానంగా తొలినాళ్ల నుంచి గుంటూరులోని అతి పెద్దపత్తి మార్కెట్ యార్డుకు ఇక్కడ కొనుగోలు చేసిన పత్తిని లారీల ద్వారా వ్యాపారులు తరలించారు. ఇందు కోసం గుంటూరు ప్రాంతానికి చెందిన బ్రోకర్లు ఎక్కువ మంది జూలూరుపాడు కేంద్రంగా సీజన్ మొత్తం దాదాపు ఆరునెలలపాటు మకాంవేసి ఇక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని రైతుల నుంచి పత్తిని కొనుగోలుచేసి మార్కెట్‌కు తరలించేవారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జూలూరుపాడు కేంద్రం పత్తికొనుగోళ్లలో ప్రత్యేకత పొందింది. కొనుగోళ్లు, రవాణాను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఏన్కూరు మార్కెట్ వ్యవసాయ కమిటీ పరిధిలోకి జూలూరుపాడు మండలాన్ని చేర్చి సిసిఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేశారు. అనంతరం మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఎనిమిదేళ్ల క్రితం స్థానిక పోలీసు స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఖాళీగా ఉన్న విశాలమైన ప్రాంతంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అధికారులు తాత్కాలిక ఉపమార్కెట్ యార్డును ప్రారంభించి కొనుగోళ్లు జరపటం మొదలుపెట్టారు. ఇక్కడ ప్రతి ఏటా కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలోనే ప్రభుత్వం జూలూరుపాడు రెవిన్యూ ఒంటిగుడిశ క్రాస్‌రోడ్డు సమీపంలో స్థలాన్ని కేటాయించి ఎఎంసి ఆధ్వర్యంలో గోదామును నిర్మించారు. అదే ప్రాంతంలో గత ఏడాది ఉప మార్కెట్ యార్డును కూడా ఎఎంసి అధికారులు ఏర్పాటుచేసి పత్తి కొనుగోళ్లు జరిపారు. అయితే ఇనే్నళుగా మండలంలో పెద్ద మొత్తంలో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నా వినిపించని ఆరోపణలు గత ఏడాది ఎఎంసి ఉద్యోగులు పలు విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎఎంసి ఉద్యోగులు కొందరు వ్యాపారులకు పరోక్షంగా సహకరించటం, ఎదురు తిరిగితే నిబంధనల పేరుతో వ్యాపారులను బెదిరించటం వంటి చర్యలకు కూడా కొందరు ఉద్యోగులు పాల్పడ్డారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. మండలంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాలతో తెల్లవారక ముందు నుంచే రైతులు పత్తిని అమ్ముకునేందుకు ఉప మార్కెట్ యార్డుకు తీసుకురావటంతో రైతులు పలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చాలీచాలని ప్రదేశం కావటంతో ఒకవైపు తల్లాడ-కొత్తగూడెం ప్రధాన రహదారి, మరో వైపు ఒంటిగుడిశ వైపు వెళ్లే రహదారి కావటంతో ఎక్కువ సంఖ్యలో పత్తిలోడుతో వచ్చిన వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయేవి. ఈ పరిస్థితి ఇలా ఉండగా దూర ప్రాంతాల నుంచి పత్తిని వాహనాల్లో మార్కెట్‌కు తీసుకురాగా ఇక్కడి వ్యాపారులు కొందరు సిండికేట్‌గా మారి నాణ్యత పేరుతో ధరలో కోత విధించటంతో, తీసుకొచ్చిన పత్తిని ఇంటికి తీసుకెళ్లలేక అయినాకాడికి తెగనమ్ముకోవాల్సి వచ్చిందని రైతులు వాపోయారు. నిబంధనల ప్రకారం మార్కెట్‌లోనే పత్తిని కొనుగోలు చేయాల్సి ఉన్నా మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో ఎక్కడబడితే అక్కడ కొనుగోళ్లు, భారీ నిల్వలు ఏర్పాటు చేసినా సంబంధిత వ్యాపారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవటం పట్ల పలు విమర్శలు తలెత్తాయి. ఏన్కూరు ఎఎంసి ఉద్యోగులు అనుసరించిన తీరుకారణంగానే గత ఏడాది ఉప మార్కెట్ యార్డులో కొనుగోళ్లు అస్తవ్యస్తంగా సాగాయని, రైతులు కూడా ఇబ్బందిపడాల్సి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపమార్కెట్ యార్డులో సమస్యలు పునరావృతం కాకుండా తగుచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలు రైతు సంఘాల నాయకులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

ఓటు నమోదుకు నేడే ఆఖరిరోజు

ఖమ్మం, సెప్టెంబర్ 24: వియోజనులంతా ఓటరుగా నమోదు చేసుకునేందుకు నేడే చివరిరోజు. సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ఇప్పుడు ఓటర్లుగా ఉన్నవారే రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులు. కొత్త ఓటర్లు, మార్పులు, చేర్పులు తదితర వాటి అన్నింటికి ఈనెల 25 చివరిరోజుకాగా వాటన్నింటిని పరిశీలించి తుదిజాబితాను అక్టోబర్ 8న అధికారులు ప్రకటించనున్నారు. ఆ జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే కొత్త ఓటర్లను చేర్చుకునేందుకు వారిలో అవగాహన కల్పించేందుకు అధికార యంత్రాంగం గత వారం రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఓటు విలువను తెలియజేస్తూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రదర్శనలు, సదస్సులు, మానవహారాలు నిర్వహించారు. నేరుగా ఆయా కళాశాలలకు వెళ్లి విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయించారు. అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద సిబ్బంది కొత్త ఓటర్ల నమోదుతోపాటు పాత ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అర్హులందరీకీ ఓటు హక్కు కల్పించేందుకు అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలకు అభినందనలు కూడా వెల్లువెత్తాయి. పలుశాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా జిల్లాలోని పలు మండలాల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం యంత్రాంగం చేపడుతున్న పలు చైతన్య కార్యక్రమాలను ఆకస్మికంగా సందర్శించటం జరిగింది. దీంతో 18 ఏళ్లు నిండిన యువత ఆయా కేంద్రాలకు వెళ్లి ఓటు నమోదు చేసుకోవటం, చాలా మంది గతంలో తీసుకున్న ఓటరు గుర్తింపు కార్డులో దొర్లిన తప్పులను సరిచేయించుకునేందుకు బారుల తీరటంతో ప్రక్రియ విజయవంతం అయిందనే భావన అదికారులను ఉత్సాహపరిచింది. ఓట్ల నమోదు కోసం అధికారులు చూపిస్తున్న చొరవకు సైతం ఆయా పార్టీల నేతలు తమకు పనితగ్గిందని భావించటం విశేషం.