క్రైమ్/లీగల్

అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. బుధవారం స్థానిక కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం సిసిఎస్ ఎసిపి ఈశ్వరయ్య, రూరల్ సిఐ తిరుపతిరెడ్డిల కథనం ప్రకారం కొదాడ క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా వివరాలు బహిర్గతమయ్యయన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తడికలపూడి గ్రామం కామవరపుకోట గ్రామానికి చెందిన నల్లబోతుల సురేష్ ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 6దొంగతనాలు, తడికెళపూడి పరిధిలో ఒక దొంగతనం చేశారన్నారు. అతని వద్ద నుండి ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జరిగిన దొంగతనాలకు సంబందించిన 25తులాల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు 7,12,500ఉంటుందన్నారు. ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఐ ఆనందరావు, సిబ్బందిని అభినందించారు.