ఖమ్మం

ఇంతకూ నామా వచ్చేనా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 8: ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని మహాకూటమి పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించారని, ఈ స్థానంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావు పోటీ చేస్తారనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని కలిగిస్తోంది. మహాకూటమి పొత్తుల్లో ఖమ్మం స్థానమే కీలకంగా ఉందని ఆయా పార్టీల రాష్ట్ర నాయకులు ఒకవైపు చెబుతుండటం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానంటూ వద్దిరాజు రవిచంద్ర సమావేశాలు నిర్వహిస్తుండటం దీనికి కారణంగా తెలుస్తోంది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మహాకూటమిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కోరుతున్నాయి. అయితే ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించారని, అందులో నామ నాగేశ్వరరావు పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. అందుకు అనుగుణంగా కార్యాలయంలో నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉంటున్నానంటూ రవిచంద్ర అనుచరులు కూడా ఇదే తరహా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే సమావేశాలు నిర్వహించడం, అందరిని కలవడంలలో రవిచంద్ర ముందుండటంతో అసలు నామ నాగేశ్వరరావు పోటీ చేస్తారా లేదా అనే అంశంపై టిడిపి శ్రేణుల్లో ఆందోళన నెలకొన్నది. ఎన్నికల నోటిఫికేషన్‌కు మూడురోజుల గడువు మాత్రమే ఉండటం, టిఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతుండటం, నామ మాత్రం ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడం అయోమయానికి దారి తీస్తున్నది. అదే సమయంలో ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా ప్రధాన నేతలు కూడా నామ పోటీ చేస్తారనే అంశంపై బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో అసలు నామ బరిలో ఉంటారా, చివరి నిమిషంలో వేరే పార్టీకి కేటాయించడం జరిగిందని చెబుతారా ప్రశ్నార్ధకంగా మిగిలింది. దీనిపై గత కొన్నిరోజులుగా ఆ పార్టీ నేతలు పార్టీ కార్యాలయానికి వచ్చి కొందరు నేతలను వాకబు చేసినట్లు సమాచారం. అదే సమయంలో నేతలను అడిగితే నామ పోటీ చేస్తారని స్పష్టం చేస్తున్నారని, సమావేశాలు కూడా నిర్వహిస్తే బాగుంటుందని అడిగితే అధికారిక ప్రకటన వెలువడిన తరువాతేనని చెప్పుకొస్తున్నారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఒకటి, రెండురోజుల్లో స్పష్టమైన ప్రకటన చేయకపోతే పార్టీ శ్రేణులు మరింత అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది.

ఆర్టీసీ కార్తీకమాస ప్రత్యేక సర్వీసులు
మధిర, నవంబర్ 8: మధిర ఆర్టీసీ డిపో నుండి కార్తీకమాసం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు మధిర డిపో మేనేజర్ సూర్యనారాయణ తెలిపారు. ప్రత్యేక సర్వీసుల ప్రచార కరపత్రాన్ని గురువారం డిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నవంబర్ 11, 18, 25, డిసెంబర్ 2 తేదీలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోటలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అదే విధంగా కార్తీకమాసంలో మధిర బస్టాండు నుండి ప్రతి ఆదివారం రాత్రి 9గంటలకు అన్నవరానికి, పంచారామాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అన్నవరానికి పెద్దలకు ఒకవైపు చార్జీ 400లు, పిల్లలకు 200లు ఉంటుందని తెలిపారు. పంచారామాలకు రాను, పోను చార్జీలు పెద్దలకు 1000, పిల్లలకు 500లుగా నిర్ణయించినట్లు తెలిపారు. బస్సులలో వెళ్ళే ప్రయాణీకులకు దర్శనానికి ఇబ్బంది కలుగకుండా ఖమ్మం ఆర్‌టిసి ఆర్‌ఎం సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అదే విధంగా 40మంది అంతకంటే ఎక్కువ మంది ప్రయాణీకులు ఉంటే ఏ ప్రదేశానికైనా బస్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు అర్టీసీ డిపోలో సంప్రదించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్, ట్రాఫిక్ ఇన్‌చార్జ్ రాజ్యలక్ష్మి, గ్యారేజ్ ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్ అభ్యర్థి విస్తృత ప్రచారం
* గుజరాతీయులతో ఆత్మీయ సమావేశం
ఖమ్మం(ఖిల్లా), నవంబర్ 8: ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంనుండి టిఆర్‌ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న పువ్వాడ అజయ్‌కుమార్ గురువారం నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. గుజరాత్ సమాజ్ మందిరంలో ఆధ్వర్యంలో త్రీటౌన్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో తన సతీమణి పువ్వాడ వసంతలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. అనంతరం 11వ డివిజన్‌లో ఇంటింటికి తిరుగుతూ తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన ప్రజా సంక్షేమాలపై ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు అవగాహన కల్గించారు. అనంతరం బృందావన్ గార్డెన్‌లో వివిధ రంగాలలో స్థిరపడిన వ్యాపారులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ గత ఎమ్మెల్యేగా ఖమ్మం నగరాన్ని తీర్చిదిద్దానని పేర్కొన్నారు. అనేక సమస్యలతో నెలకొన్న త్రీటౌన్ ప్రాంత అభివృద్ధికి
అనేక చర్యలు చేపట్టానన్నారు. తాగునీటి సమస్య తీర్చడంతోపాటు అంతర్గత రోడ్ల అభివృద్ధికి పాటుపడిన విషయాన్ని గుర్తు చేశారు. తనను ఆశీర్వదించి తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.