క్రైమ్/లీగల్

రివాల్వర్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, నవంబర్ 8: విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సత్తుపల్లి మండలం గంగారం 15వ బెటాలియన్ క్యాంపులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. బుధవారం రాత్రి దీపావళి పండగ వేడుకల్లో అందరూ నిమగ్నమయి ఉండగా 15వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం పూజారిగూడెంకు చెందిన పునె్నం శ్రీనివాస్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని అక్కడికక్కడే చనిపోయాడు. దీపావళి కారణంగా మొదట టపాసుల శబ్దంగా భావించిన తోటి సిబ్బంది తుపాకి పేలిన శబ్దంతో శ్రీనివాస్ వద్దకు వెళ్ళి చూడగా శ్రీనివాస్ మృతిచెంది ఉన్నాడు. దీంతో సిబ్బంది వెంటనే బెటాలియన్ కమాండెంట్ రాంప్రకాష్‌కు సమాచారం అందించారు. ఆయన సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించి ఈ విషయాన్ని సత్తుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.శ్రీనివాస్‌కి రాధ అనే ఆమెతో పదేళ్ళ క్రితం వివాహం జరిగింది. రెండేళ్ళ క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో విడిపోయారు. ఈ మేరకు చర్ల పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్‌పై భార్య పిర్యాదు చేయటంతో కేసు నమోదైంది. అప్పటి నుంచి అదే గ్రామానికి చెందిన మరో వివాహితురాలు సరితతో అక్రమ సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడు. అయితే బుధవారం సరితతో గొడవపడి దాడికి దిగాడు, ఈ ఘటనలో సరిత గాయపడటంతో సరిత తరపున బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో తనపై తిరిగి కేసు నమోదు అవుతుందని భావించిన శ్రీనివాస్ తుపాకీతో కాల్చుకొని మృతిచెందాడు. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.