ఖమ్మం

పొత్తులకు కీలకంగా మారిన కొత్తగూడెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, నవంబర్ 8: మహాకూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, సీపీఐ పార్టీల నాయకులు కొత్తగూడెం సీటు కోసం పట్టుబడుతుండటంతో అధిష్టాన వర్గానికి తలనొప్పిగా మారింది. పొత్తులకు కొత్తగూడెం నియోజకవర్గం కీలకంగా మారటంతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కొత్తగూడెం వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ సీటు కోసం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ శాసన సభ్యుడు కూనంనేని సాంబశివరావులు గట్టి పట్టుబడుతుండటంతో మహాకూటమి పొత్తుల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. దీపావళి పండుగ తర్వాత వెంటనే మహాకూటమి పొత్తుల జాబితా వెలువడుతోందని ప్రకటనలు వచ్చినప్పటికీ కొత్తగూడెం సీటును రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో అభ్యర్థుల ప్రకటనలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నియోజక వర్గంలో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు నేతృత్వంలో కొత్తగూడెం పట్టణంలో భారీ వాహనాల ర్యాలీ నిర్వహించగా, సీపీఐ ఆధ్వర్యంలో మాజీ శాసన సభ్యుడు కూనంనేని సాంబశివరావు మద్దతు తెలుపుతూ రుద్రంపూర్ నుంచి పెద్దమ్మగుడి వరకు వాహనాల ర్యాలీ నిర్వహించి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మహాకూటమిలో మరో భాగస్వామి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ సైతం కొత్తగూడెం పట్టణంలో పాదయాత్రల ద్వారా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్, సీపీఐ, తెలుగుదేశం పార్టీలు మహాకూటమిలో భాగస్వాములు అయినప్పటికీ కొత్తగూడెంలో మాత్రం వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించటంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కొత్తగూడెం సీటును ఆశిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు యడవల్లి కృష్ణ సైతం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించటం గమనార్హం. టిఆర్‌ఎస్ అభ్యర్ధి జలగం వెంకటరావు మాత్రం గత నెల రోజులకు పైగా నియోజక వర్గంలోనే మకాం వేసి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. మహాకూటమి అభ్యర్థులు ఎవరో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా శుక్ర, శని వారాల్లో మహాకూటమి అభ్యర్ధుల జాబితా వెలువడే అవకాశం ఉండటంతో అన్ని ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా మహాకూటమి అభ్యర్థులు మాత్రం సీట్ల కోసం హైద్రాబాద్, ఢిల్లీ స్థాయిలో తమతమ అగ్రనాయకుల ద్వారా పైరవీలు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం లోపు మహాకూటమి జాబితా వెలువడే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
* జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్
ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 8: జిల్లాలో ఎన్నికలను సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ప్రజ్ఞామందిరంలో నిర్వహించిన ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అవగాహన చేసుకోవాలన్నారు. నామినేషన్ల స్వీకరణ ఫారం-26 అఫిడివిట్, ఇవిఎంలలో గుర్తుల కేటాయింపు సువిధ పోర్టర్ ద్వారా ఇచ్చే అనుమతులు, సివిజిల్ మోబైల్, వివి ప్యాడ్స్ పనితీరు, మాక్ పోలింగ్ అధికారులు సిబ్బందిని పోలింగ్ కేంధ్రాలకు తరలించటం లాంటి చర్యలను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎన్నికల నిర్వహణపై అప్రమత్తంగా ఉండి సమర్దవంతగా నిర్వహించాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు సునీల్‌కుమార్ హిరమత్, నగేష్, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

వైరా బరిలో తొలిసారిగా బీజేపీ
* చాపకిందనీరులు సాగుతున్న ప్రచారం
కొణిజర్ల, నవంబర్ 8: నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఖమ్మం జిల్లాలో 2009లో నూతనంగా ఆవిర్భవించిన వైరా నియోజకవర్గంలో తొలిసారి భారతీయ జనతా పార్టీ తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతోంది. తెలంగాణాలో పాగా వేయాలన్న లక్ష్యంలో భాగంగా వైరాలో సైతం తన అభ్యర్థిని రంగంలోకి దింపుతు అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలోనే వైరా నియోజకవర్గ అభ్యర్థి పేరును అధికారికంగా ఖరారు చేశారు. కారేపల్లి మండలం భాగ్యనగరి తండాకు చెందిన సినీనటి రేష్మా రాథోడ్ పోటీ చేయనున్న ప్రకటించటంతో ఆ పార్టీ మండల, బూత్ స్థాయి నాయకుల్లో నూతనోత్సాహం నెలకొంది. పార్టీ తన పేరును అధికారికంగా ప్రకటించటంతో హంగు, ఆర్భాటం లేకుండ చాపకింద నీరులా తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండల, బూత్ కమిటీ నాయకులు కలిసి వారితో సమావేశాలు నిర్వహించి ఎన్నికలలో వ్యవరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలపై చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా గెలుపే ధ్యేయంగా ఆపార్టీ పార్టీ సంస్థాగత కమిటీల నియామకంపై దృష్టి సారించింది. మండల బూత్ కమిటీల ఏర్పాటును వేగవంతం చేసింది. ఐదు మండల కమిటీలతోపాటు నియోజకవర్గ వ్యాపితంగా ఉన్న 229 బూత్‌లకుగాను 121 బూత్ కమిటీలను ఏర్పాటు చేసింది. రెండు, మూడు రోజుల్లో మిగతా కమిటీల నియామకాన్ని పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతోపాటు గత నాలుగు రోజుల క్రితం కొణిజర్ల మండలానికి చెందిన యువకుడు, విద్యావంతుడు, బిసి సామాజిక వర్గానికి చెందిన బండారు నరేష్‌ను నియోజకవర్గ కన్వీనర్‌గా నియమించారు. అంతేగాక అభ్యర్థి రేష్మా రాథోడ్ తన పుట్టిన రోజు వేడుకలను కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవటం విశేషం. ఇటీవల నియోజకవర్గ వ్యాపితంగా పలు గ్రామాలలలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి ఆడిపాడి ప్రజలలో మమేకమయ్యారు. సినీ గ్లామర్‌తోపాటు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేపథకాలు గెలుపునకు దోహదపడతాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బిజెపి చీల్చే ఓట్లు ఏపార్టీకి నష్టం చేస్తుందో అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.