ఖమ్మం

భద్రాద్రిలో నేటి నుంచి బాలల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 8: బాలల పండుగకు భద్రాద్రి ముస్తాబైంది. 6వ సారి నిర్వహిస్తున్న భద్రాద్రి బాలోత్సవం-2018ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా ఈసారి బాలలు భద్రాద్రిలో జరిగే బాలోత్సవంనకు హాజరు కానున్నారు. బాలల సర్వతాముఖాభివృద్ధే ధ్యేయంగా తాళ్ళూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు, ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్(తానా), ఐటీసీ పీఎస్‌పీడీ, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో భద్రాచలంలో నేటి నుంచి జాతీయ స్థాయి తెలుగు బాలల పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం సకల ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు 10వేల మంది చిన్నారులతో పాటు మరో 500 మంది వరకు ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు హాజరవుతారని భావిస్తున్నారు. చిన్నారులు, న్యాయనిర్ణేతల కోసం పట్టణంలో పలుచోట్ల వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. స్థానిక జూనియర్ కళాశాల క్రీడామైదానంలో మొత్తం 7 వేదికలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. జాతీయస్థాయి తెలుగు బాలల పండుగను కనివినీ ఎరుగుని రీతిలో చేయాలని నిర్వాహకులు పట్టుదలగా ఉండగా ఇప్పటికే 4200 ఎంట్రీలు వచ్చాయి. అంతర పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాలుగా పిలవబడుతున్న భద్రాద్రి బాలోత్సవంను నిర్వహించడం ముచ్చటగా ఆరవసారి కాగా ఈసారి జాతీయ స్థాయిలో ఈ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. తాళ్ళూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ తాళ్ళూరి పంచాక్షరయ్య, ఆయన తనయులు తాళ్ళూరి రాజాశ్రీకృష్ణ, తాళ్ళూరి జయశేఖర్‌లు ప్రత్యేక చొరవ తీసుకొని గతం కంటే భారీస్థాయిలో ఈ బాలోత్సవంను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భద్రాద్రికి వచ్చే బాలలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. చిన్నారులు బస చేసే ప్రాంతాల నుంచి వేదికల వద్దకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. బాలోత్సవంనకు పట్టణ ప్రముఖులు పాకాల దుర్గాప్రసాద్ తన సహాయ సహకారాలు అందిస్తుండగా కార్యదర్శి వి.వంశీకృష్ణ, కన్వీనర్ ఎస్‌సీహెచ్ చక్రవర్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శి అల్లం నాగేశ్వరరావు తదితరులు వారం రోజుల నుంచి బాలోత్సవం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే జూనియర్ కళాశాల మైదానం వద్ద నిర్మిస్తున్న వేదికలకు ఒక కొలిక్కి రాగా అంచనాకు మించి చిన్నారులు తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 27 అంశాల్లో 43 విభాగాల్లో ఈ బాలోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గతంలో నిర్వహించిన అంశాలతో పాటు ఈసారి మట్టితో ఆకృతులు చేయడం, స్పెల్‌బీ, కథా విశే్లషణ, కవితా రచన మొదలైన ఐదు అంశాలను అదనంగా కార్యక్రమాల్లో జోడించారు. మూడు నెలల నుంచి బాలోత్సవం నిర్వహణ కోసం సన్నాహాలు ప్రారంభించారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న బాలల పండుగ కావడంతో అందరికీ తెలిసేలా ప్రచారం చేయడంలో నిర్వాహకులు విజయవంతమయ్యారు. మన సంప్రదాయ, సంస్కృతి సౌరభాలను గుబాళింపు చేస్తూ సంప్రదాయ కళల పట్ల బాలబాలికలకు అభిరుచి పెంపొందించడానికి భద్రాచలంలో నిర్వహించే బాలోత్సవం ఒక వేదిక అవ్వాలన్న సంకల్పంతో గత ఐదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ‘ఒకే కంఠం.. ఒకే గమ్యం...ఒకే నినాదం మనదంతా’ అనే స్ఫూర్తిని చిరుప్రాయంలో అంకురింపజేయాలనే ఉద్దేశంతో భద్రాద్రి బాలోత్సవంనకు రూపకల్పన చేసినట్లు తాళ్ళూరి పంచాక్షరయ్య ట్రస్టు ఛైర్మన్ పంచాక్షరయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తుండగా నాలుగు రాష్ట్రాలకు చెందిన చిన్నారులు హాజరవుతున్నారు. తొలిరోజు జానపదం గ్రూప్, కూచిపూడి సోలో, ఏకపాత్ర, రాగ(వాద్య సంగీతం), చిత్రలేఖనం, లఘుచిత్ర సమీక్ష, గిరిజన సంప్రదాయ నృత్యం, వక్తృత్వం, నాటకీకరణం, లయ వాద్య సంగీతం, మట్టితో ఆకృతులు, నాటికలు తదితర పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం వేదిక వద్ద నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. మూడురోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించనున్న బాలోత్సవం మనందరి పండుగ అని, భద్రాద్రి వాసులంతా బాలల పండుగను తమదిగా భావించి జయప్రదం చేయాలని వారు కోరారు. బాలోత్సవం ద్వారా భద్రాద్రి ఖ్యాతి మరింత ఉన్నతస్థాయికి వెళుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.