ఖమ్మం

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి -- * సండ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుబల్లి, నవంబర్ 20: సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేయటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని దక్కించుకున్న కెసిఆర్ ప్రజలకు ముందుగా క్షమాపణ చెప్పాలని సత్తుపల్లి మహాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ధ్వజమెత్తారు. మంగళవారం వీఎంబంజర్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రాజెక్టులకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేఖమంటూ కేసీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని తమ పార్టీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఎప్పుడూ కాపాడుతుందని ఆయనన్నారు. ప్రాజెక్టుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ప్రాజెక్టుల పేరుతో కెసిఆర్ చేస్తున్న దోపిడిని అడ్డుకుంటున్నందుకే ఏపి సిఎం చంద్రబాబు నాయుడుపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చకొట్టే విధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఇటువంటివి మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్పుతారని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో తెరాస ఓటమి పాలవుతుందని గ్రహించిన కెసిఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలుగువారి ప్రయోజనాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ తిరిగి మరోసారి మోసం చేసేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. పోడు భూములను సాగుచేస్తూ జీవిస్తున్న వారికి నోటికాడ పంటను కూడా లాక్కున్న చరిత్ర ఈ ప్రభుత్వం మూటకట్టుకుందని తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ మరోసారి మోసపోకుండా ఉండేందుకు ఈ ఎన్నికలలో సరైన నిర్ణయం తీసుకొని మహాకూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ప్రచారంలో భాగంగా ఓ టీస్టాల్‌లో టీ తయరు చేసి అక్కడున్న వారి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు కనగాల సాంబశివరావు, భూపాల్ రెడ్డి, ఆచంటి శ్రీను, కొత్తగుళ్ల అప్పారావు, వర్థబోయిన నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు చీకటి చిన్న నరసింహారావు, యడ్ల వెంకటేశ్వరరావు, కాంతయ్య, గోగినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మధిరలో టీఆర్‌ఎస్‌కు గండి
* కాంగ్రెస్ గూటికి చేరిన ఏడుగురు కౌన్సిలర్లు
* టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన మల్లాది వాసు
మధిర నవంబర్ 20: అధికార టిఆర్‌ఎస్ పార్టీకి మధిరలో గండి పడింది. రాజకీయ చాణక్యం ప్రదర్శించిన టిపిసిసి ప్రచార కమిటి చైర్మన్, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క వ్యూహాత్మకంగా టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు మల్లాది వాసు ఇంటికి మంగళవారం వెళ్ళి మంతనాలు జరిపి వాసుతోపాటు 7గురు వార్డు కౌన్సిలర్లకు కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. మధిర మండలంలో భారీ అనుచరగణం కలిగిన వాసు కాంగ్రెస్ గూటికి చేరడంతో అధికార టిఆర్‌ఎస్‌కు గండి పడింది. గతంలో భట్టివిక్రమార్క ముఖ్య అనుచరుడుగా వున్న వాసు తుమ్మల టిఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి రావడంతో తన అనుచరులతో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గత కొన్ని రోజులుగా వాసు, ఆయనతో సన్నిహితంగా వుండే 7గురు వార్డు కౌన్సిలర్లు టిఆర్‌ఎస్ పార్టీపై అసంతృప్తితో వున్న విషయాన్ని పసిగట్టిన భట్టి వ్యూహత్మకంగా పావులు కదిపి అధికార పార్టీకి షాకిచ్చారు. ఒక వైపుఎలాగైనా కమల్‌రాజు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎంపి పొంగులేటి పావులు కదుపుతుండగా టిఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ గూటికి చేరడం చర్చనీయాంశంగా మారింది.కాంగ్రెస్‌లో చేరిన వార్డు కౌన్సిలర్లలలో 1, 5,7,9,13,16,17 వార్డు కౌన్సిలర్లు బొడ్డు నాగేశ్వరరావు, పుల్లూరి బాబు,మోషే, మల్లవరపు వరలక్ష్మి, కోనా సుచరిత, మునుగోటి వెంకటలక్ష్మి, గుండెమెడ పావని, నాయకులు కోన ధనికుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు, గుండెమెడ బాలాజీ తదితరులు ఉన్నారు.