ఖమ్మం

రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వాన్ని ఓడిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 20: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తమ న్యాయమైన డిమాండ్‌లను తీర్చాలని కోరిన అన్నదాతలకు బేడీలు వేసి, అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసిన టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని రైతులు తెలిపారు. తమను జైలు పాలు చేసిన సమయంలో తమకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావును అన్నదాతలు మండెపూడి ఆనందరావు, భూక్యా శ్రీను, ఇస్లావత్ బాలు, భూక్యా నర్సింహరావు, బాణోత్ ఉపేందర్, బాణోత్ సైదులు మంగళవారం నామా క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనాటి దుర్ఘటనను, తాము మానసింకంగా అనుభవించిన బాధను రైతులు నామకు విన్నవించారు. పుట్టెడు కష్టంలో ఉన్న తమను అదుకొని పోరాడి తమకు తగు న్యాయం చేసిన నామకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వేధించిందన్నారు. అన్నదాతలను వేధించిన ప్రభుత్వం ఏది మనజాలలేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధల కల్పించమన్న నేరానికి అన్నదాతలను కెసిఆర్ ప్రభుత్వం జైలు పాలు చేసిందని, కావున తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం అసన్నమైందన్నారు. ప్రజాకూటమి రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఎక కాలంలో 2లక్షల రూపాయల రుణమాఫి, సాగుకు ఆర్ధిక సహయం ప్రజాకూటమి ప్రభుత్వం అందజేస్తుందన్నారు. సాగునీటి వసతి, నాణ్యమైన విద్యుత్, వ్యవసాయ యాంత్రీకరణ, తదితర అధునిక వ్యవసాయ పద్దతులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందన్నారు. ప్రత్యేక్షంగా ప్రభుత్వ వేధింపులకు గురైన మీరు ప్రజాకూటమికి మద్దతు ఇవ్వడం హర్షనీయమన్నారు. తమకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన అన్నదాతలకు నామ కృతజ్ఞతలు తెలిపారు.

దేశ ప్రయోజనాలకోసం బీజేపీకి పట్టం కట్టండి
* రాఫెల్ ఆరోపణలు అర్థరహితం
* బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
ఖమ్మం(క్రైం), నవంబర్ 20: దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులకు విజయం చేకూర్చాలని బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రజలను కోరారు. మంగళవారం ఖమ్మంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాకూటమి అర్థంలేని కూటమిగా అభివర్ణించారు. ప్రధాని మోడి ప్రజల సంక్షేమే ధ్యేయంగా అన్ని రాష్ట్రాల్లో 126 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు లబ్ధిచేకూరుస్తున్నారన్నారు. రాష్ట్రాలలో కొనసాగుతున్న కుటుంబం, కులప్రాతిపదికలపై పాలన సాగడంపై ఆయన మండిపడ్డారు. దేశ ప్రధాని అయినప్పటికి మరే ఇతర పదవుల్లో ఉన్నప్పటికి బిజెపి నాయకులు అధికార ఆర్భాటాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవకులుగానే ఉంటారన్నారు. రాఫెల్ కుంభకోణంపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందించారు. రాఫెల్ కుంభకోణంపై భారతదేశానికి గానీ, ప్రధాని మోడికిగాని ఎలాంటి సంబంధంలేదని, సుప్రీంకోర్టు పరిధిలో ఉందని త్వరలోనే నిజాలు బయటపడతాయన్నారు. ఖమ్మం బిజెపి అభ్యర్థి ఉప్పల శారద మాట్లాడుతూ తెలంగాణలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ అహంకారపూరితంగా పాలన కొనసాగిస్తున్నారని, టిఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా అదే అహంకారపూరితంగా వ్యవహిస్తున్నారని, ప్రశ్నించినవారిపై అవదులు దాటి విమర్శలు చేస్తున్నారన్నారు. టిఆర్‌ఎస్ పెట్టిన పథకాలు ఏ ఒక్కటి సంపూర్ణంగా పూర్తికాలేదని విమర్శించారు. ఖమ్మంలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సనె్న ఉదయ్‌ప్రతాప్, నాయకులు సురేష్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, ఉపేందర్, మేకల నాగేందర్, కురిచేటి రామచంద్రమూర్తి, కురిచేటి శ్రీనివాస్, కోకిల, శ్రీదేవి, పద్మ, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.