ఖమ్మం

మహాకూటమికి అనుకూల ప్రభంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, నవంబర్ 20: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరుగనున్న ఎన్నికల్లో మహాకూటమికి అనుకూల ప్రభంజనం వీస్తోందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండల పరిధిలోని వినోభానగర్, సూరారం, గుండెపుడి, అనంతారం, కాకర్ల పలు గ్రామాల్లో కూటమి అభ్యిర్థి విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా జూలూరుపాడులోని పత్తి మార్కెట్ యార్డు వద్ద జరిగిన ప్రచారం కార్యక్రమం సందర్భంగా కూనంనేని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభంజనం వినిపిస్తుంది. ఇదెలా ఉందంటే నాడు దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభంజనం ఎలా ఉందో, 1978లో కాంగ్రెస్ చీలిపోయిన తర్వాత ఏర్పడిన ఇందిరా కాంగ్రెస్ ప్రభంజనం ఎలా ఉందో ఆ విధంగానే మహాకూటమికి అనుకూల వాతావరణం ప్రజల్లో కనిపిస్తుందన్నారు. నాలుగున్నరేళ్ల కెసిఆర్ ప్రభుత్వ పనితీరు దేశంలో ఎక్కడా లేనంతగా సంక్షేమం, అభివృద్ధి అమలు విషయంలో విఫలమైందని ఆరోపించారు. ప్రగతి భవన్ ఒక గాజుమేడలాంటిదని, ఆ మేడలో ఇంతకాలం ఉండి అంతా బాగుందని కెసిఆర్ కలలు కన్నారని అన్నారు. ఇవ్వాళ ఒక్కసారిగా ప్రజల్లోకి వచ్చి ఏం చెప్పాలో.. ఏంచేశారో చెప్పలేక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఎక్కడికి వెళ్లినా టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను ప్రజలు నిలదీస్తున్నారని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర కావాలని అడిగితే రైతులకు బేడీలు వేయించిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. నీవు చేశావా, నీ సిబ్బంది చేశారా అనేది ప్రశ్న కాదు రైతులపై అక్రమ కేసులు బనాయించినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను అమలు చేయటంలో టిఆర్‌ఎస్ ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికల సందర్భంగా మహాకూటమి స్పష్టమైన వాగ్దానాలు చేసిందన్నారు. అధికారంలోకి వస్తే రైతులకు రూ 2లక్షల ఏకకాల రుణమాఫీ చేసి తీరుతుందని, అర్హులైన పేదలు వారి స్థలాల్లోనే డబుల్ బెడ్‌రూం ఇంటిని నిర్మిస్తామని, నిరుద్యోగ భృతి, డ్వాక్రా మహిళల ఆర్ధికాభివృద్ధికి మెరుగైన పథకాలు వంటి హామీలను కచ్చితంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం, టిజెఎస్, సిపిఐ మహాకూటమి అభ్యర్థి విజయబాయిని ఎన్నికల్లో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు తాళ్లూరి అప్పారావు, దుద్దుకూరి సుమంత్, మండల అధ్యక్షులు యల్లంకి కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్‌ఛార్జి మాళోతు రాందాస్ నాయక్, సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి ఎర్రా బాబు, మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, దేవినేని జనార్ధన్, షేక్ చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.