బిజినెస్

‘కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పిఎఫ్‌పై దర్యాప్తు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రావిడెంట్ ఫండ్ విరాళాలపై త్వరలో దర్యాప్తును ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ‘ఇప్పటిదాకా ఈ వ్యవహారాన్ని మేము పరిశీలించలేదు. త్వరలోనే ఈ అంశాన్ని నేను పరిశీలిస్తాను.’ అని దత్తాత్రేయ పిటిఐతో అన్నారు. విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రభుత్వరంగ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బకాయిపడి విమానయాన సేవలకు దూరంగా ఉన్నది తెలిసిందే. ప్రస్తుతం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు తమ వేతన బకాయిల కోసం ఆందోళన కూడా చేస్తున్నారు. తీసుకున్న రుణాలు చెల్లించని మాల్యాను ఎస్‌బిఐసహా పలు బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించగా, ఈ వ్యవహారం కోర్టులదాకా కూడా వెళ్లింది.
మరోవైపు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్యాంకులకు 10,000 కోట్ల రూపాయలు బకాయిపడితే, ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా దాదాపు 30,000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదేమిటని ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్‌ఒ టివి మోహాన్‌దాస్ పాయ్ ప్రశ్నించారు. ఆదివారం ఇక్కడ ఆయన పిటిఐతో మాట్లాడుతూ కింగ్‌ఫిషర్ వ్యవహారంలో బ్యాంకుల సొమ్ము, ఎయిరిండియా విషయంలో ట్యాక్స్ పేయర్ల సొమ్ము ఇబ్బందుల్లో పడిందన్నారు.