కృష్ణ

కృష్ణా తరంగ్‌లో విద్యార్థుల జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 27: కృష్ణా తరంగ్-2016 యువజనోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఉదయం పాశ్చాత్య సంగీతం, శాస్ర్తియ సంగీతం, తంత్రీ వాద్య సంగీతం, జానపద నృత్యాలు, ఏకాంకిక ప్రదర్శనలు నిర్వహించారు. విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాల విద్యార్థుల ‘కాంట్రవర్సీ’ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు, రిజిస్ట్రార్ డి సూర్యచంద్రరావు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ వైకె సుందరకృష్ణ, కృష్ణా తరంగ్- 2016 కన్వీనర్ ఉషా, కోకన్వీనర్ డా. ఎం శ్రావణి, వివిధ శాఖాధిపతులు, జిల్లా నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.