క్రీడాభూమి

పట్టు బిగించిన కివీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంకతో మొదటి టెస్టు
డ్యునెడిన్, డిసెంబర్ 12: శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టుపై న్యూజిలాండ్ పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 431 పరుగుల భారీ స్కోరు చేసిన ఈ జట్టు ఆతర్వాత శ్రీలంకను 294 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను
ఆరంభించి, ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 171
పరుగులు సాధించింది. మ్యాచ్ మూడోరోజు, శనివారం
ఉదయం నాలుగు వికెట్లకు 197 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన శ్రీలంక ఎక్కువ సేపు పోరాటాన్ని కొనసాగించలేకపోయింది. మరో 97 పరుగులు జోడించి, ఆరు వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ కరుణరత్నే (84), వికెట్‌కీపర్ దినేష్ చండీమల్ (83), సిరివర్ధనే (35) కొంత సేపు కివీస్ బౌలింగ్‌ను ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. నీల్ వాగ్నర్, టిమ్ సౌథీ చెరి మూడు వికెట్లు పడగొట్టి, లంకను దెబ్బతీశారు. మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్ చెరి రెండు వికెట్లు కూల్చారు.
తొలి ఇన్నింగ్స్‌లో 137 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, 79 పరుగుల స్కోరువద్ద మార్టిన్ గుప్టిల్ వికెట్‌ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతను 82 బంతులు ఎదుర్కొని, 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగు చేసి రంగన హెరాత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం టామ్ లాథమ్ (72 నాటౌట్), కేన్ విలియమ్‌సన్ (48 నాటౌట్) మరో వికెట్ కూలకుండా, మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి స్కోరును 171 పరుగులకు చేర్చారు. దీనితో న్యూజిలాండ్ ఆధిక్యం 308 పరుగులకు చేరుకోగా, ఇంకా తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నాయి.