క్రీడాభూమి

కివీస్ చేతిలో లంక చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్ట్‌చర్చి, డిసెంబర్ 26: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో చిత్తయింది. కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ మెరుపు వేగంతో అర్ధ శతకాన్ని సాధించి న్యూజిలాండ్ విజయంలో కీలక భూమిక పోషించాడు. అంతకు ముందు లంక ఇన్నింగ్స్‌ను మాట్ హెన్రీ దారుణంగా దెబ్బతీశాడు. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ను ఎంచుకొని తొలి వికెట్‌ను 13 పరుగుల వద్ద కోల్పోయింది. గుణతిలక ఎనిమిది పరుగులు చేసి మిల్నే బౌలింగ్‌లో వికెట్‌కీపర్ రోన్చీకి చిక్కడంతో ఆరంభమైన వికెట్ల పతనం ఆతర్వాత కూడా కొనసాగింది. ఒకానొక దశలో 65 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. వంద పరుగుల మైలురాయిని చేరడం కూడా అసాధ్యంగా కనిపించిన తరుణంలో మిలింద సిరివర్దన, నవాన్ కులశేఖర బాధ్యతాయుతమైన ఆటతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. సిరివర్దనే 66 పరుగులు చేసి బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో మెక్‌కలమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా, కులశేఖరను రోన్చీ క్యాచ్ అందుకోగా మెక్‌క్లీనగన్ అవుట్ చేశాడు. టెయిలెండర్లు ఎవరూ క్రీజ్‌లో నిలదొక్కుకోలేదు. ఫలితంగా లంక ఇన్నింగ్స్‌కు 47 ఓవర్లలో 188 పరుగుల వద్ద తెరపడింది. హెన్రీ 10 ఓవర్లలో 49 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్రాస్‌వెల్‌కు మూడు, మెక్‌క్లీనగన్‌కు రెండు చొప్పున వికెట్లు లభించాయి.
లంకను ఓడించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యాన్ని సంపాదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, బ్రెండన్ మెక్‌కలమ్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు వీరు 10.1 ఓవర్లలో 108 పరుగులు జోడించారు. 25 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో వీరవిహారం చేసిన మెక్‌కలమ్ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్‌కాగా, లాథమ్ 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 56 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసిన గుప్టిల్‌ను కులశేఖర క్యాచ్ పట్టగా సిరివర్దన అవుట్ చేశాడు. అనంతరం రాస్ టేలర్ (5 నాటౌట్), కెరీర్‌లో తొలి వనే్డ ఆడిన నికోల్స్ (23 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ జట్టుకు విజయాన్ని అందించారు. కివీస్ 21 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హెన్రీ ఎంపికయ్యాడు. ** ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాట్ హెన్రీ (4/49). **
సంక్షిప్త స్కోరు
శ్రీలంక ఇన్నింగ్స్: 47 ఓవర్లలో 188 ఆలౌట్ (సిరివర్దన 66, కులశేఖర 58, హెన్రీ 4/49, బ్రాస్‌వెల్ 3/37, మెక్‌క్లీనగన్ 2/40).
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 21 ఓవర్లలో 3 వికెట్లకు 191 (గుప్టిల్ 79, మెక్‌కలమ్ 55).