ఖమ్మం

నేడు రామావతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 16: భద్రాచలం రామాలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి నేడు రామావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోకకంటకులైన రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథ కుమారుడిగా శ్రీమన్నారాయణుడు రాముని అవతారం ధరించాడు. వ్యక్తిగత సౌఖ్యాల కన్నా ధర్మాచరణే ఉత్తమమని అదే శాశ్వతమైందని భావించి, పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు. సూర్యగ్రహ బాధలున్న వారు రామావతారాన్ని దర్శించడం వల్ల వాటి నుంచి విముక్తిని పొందుతారని భక్తుల నమ్మకం.

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
* పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్
* కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 16: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల పోలింగ్ సిబ్బంది, లెక్కింపు అధికారులు సహకరించాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజ్ఞా మందిరంలో ఎన్నికల పోలింగ్ సిబ్బందికి, అధికారులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ తీరును, నిబంధనలను వివరించారు. పోలింగ్ పరిధిలోకి ఓటర్లను అనుమతించే విధానం, ఓటర్లకు బ్యాలెట్ పత్రాలు అందించే విధానం, ఓటింగ్‌కు అనుమతించే ముందు పరిశీలించాల్సిన ధృవప్రతాల పరిశీలనపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఓటు వేసిన అనంతరం ఓటర్లు ష్లిప్‌ను మడిచే విధానం గురించి సిబ్బందికి వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 4 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందని, ప్రతి కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ ఉంటుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు కెడికె వెర్మ పరిశీలించి జిల్లాలోని ఎన్నికల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె బాబురావు, పాల్వంచ సబ్‌కలెక్టర్ కాళీచరణ్, కొత్తగూడెం ఆర్డీవో రవీంధ్రనాథ్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

శిబిర రాజకీయంలో
‘యాత్రా స్పెషల్’
* తమ వారిని కాపాడుకోవడం,
ఇతరులను ఆకర్షించడమే లక్ష్యం
* ఓటర్లకు కలిసివచ్చిన అవకాశం
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 16: రాష్ట్రంలోనే అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీల నేతలు పడుతున్న శ్రమ వర్ణనాతీతం. ముఖ్యంగా తమకు మద్దతు ఇచ్చినటువంటి నేతలను ప్రత్యర్థులనుంచి కాపాడుకోవడమే ప్రహసనంగా మారింది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార టిఆర్‌ఎస్ నేతలు లోపాయకారి ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారనే ప్రచారంతో ఇతర పార్టీలు అప్రమత్తమయ్యాయి. తాజాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను మూడు బస్సుల ద్వారా ఊటికి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి దక్షిణభారత దేశ యాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరిగే 27వ తేదీకి ముందు రోజున వారిని ఖమ్మంకు తీసుకురానున్నారు.మరో వైపు తెలుగుదేశం శిబిరం కృష్ణాజిల్లా నందిగామ వద్ద ఏర్పాటు చేసినట్లు తెలుస్తుండగా, కాంగ్రెస్ శిబిరం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు శిబిరాల నుంచి కూడా విడివిడిగా నేతలను పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్ళనున్నారు. మరో వైపు వామపక్ష పార్టీల అభ్యర్థికి మద్దతు ఇచ్చే వారిని కూడా ఖమ్మం రూరల్‌మండలం తెల్దార్‌పల్లి, ఖమ్మం నగరం తదితర ప్రాంతాలలో ఉంచారని, వారిని కూడా శుక్రవారం వైజాగ్‌కు తీసుకెళ్ళనున్నట్లు సమాచారం. టిఆర్‌ఎస్ మద్దతుదారులు ఇప్పటికే హైదరాబాద్‌లోని మేడ్చల్ ప్రాంతంలో ఉన్న ఓ రిసార్ట్స్‌లో ఉండగా వారిని వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఒక ప్రాంతానికి తరలించనున్నట్లు సమాచారం. జిల్లాలోని ఓటర్లను విడివిడిగా ఒక్కో ప్రాంతానికి తరలిస్తూ ఇతరులకు చిక్కకుండా ఉండేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు కొంత మంది ఎంపిటిసిలు, జడ్పిటిసిల కోరికలను తీర్చడం తలకుమించిన భారంగా అభ్యర్థులు భావిస్తుండడం గమనార్హం. ఈ నెల 27వ తేదీ వరకు కొంత మందిని కాపాడుకోవడం కష్టంగానే ఉందని ఓ పార్టీ నేత చెప్పడం క్యాంప్‌ల్లోని పరిస్థితి తెలియజేస్తోంది. తమ వారిని కాపాడుకుంటూనే ఎవరికివారు ప్రత్యర్థి శిబిరంలోని వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండడం అందరికి ఆందోళన కలిగించే అంశం.

సమస్యలు పరిష్కారం కాకుంటే
అది పరిపాలనా లోపమే
* విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
* ప్రతి శాఖను నిశితంగా పరిశీలిస్తా
* ఐటీడీఏ పీవో రాజీవ్‌గాంధీ హన్మంతు

భద్రాచలం, డిసెంబర్ 16: దర్బార్‌లో వచ్చే సమస్యలు పరిష్కారం కాకుంటే అది పరిపాలనా లోపమేనని తాను భావిస్తున్నానని నూతన ఐటీడీఏ పీవో రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు. తన ఛాంబర్‌లో బుధవారం ఆయన విలేఖర్లతో ముచ్చటించారు. విద్య, వైద్యంపై తన ప్రత్యేక దృష్టి ఉంటుందని, ప్రతి శాఖను నిశితంగా పరిశీలిస్తానని వెల్లడించారు. దర్బార్‌లో వచ్చే సమస్యలను ఆన్‌లైన్‌లో పొందుపర్చే విధానాన్ని అప్‌డేట్ చేస్తామన్నారు. అందుకు అధికారులకు కొన్ని మార్గదర్శకాలు విధించి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి శాఖపై తన దృష్టి ఉంటుందని, రెండు నెలల వరకు సమస్యలపై అవగాహన తెచ్చుకుంటానని, ఆ తర్వాతే తప్పు చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. అసిఫాబాద్‌లో సబ్ కలెక్టర్‌గా గిరిజన సమస్యలపై అవగాహన ఏర్పడిందని, అక్కడ రాత్రి 9 గంటల వరకు పనిచేశానని అన్నారు. నిరంతరం సమీక్షల ద్వారా పర్యవేక్షణతో సమస్యల పరిష్కారం సాధ్య పడుతుందన్నారు. సమస్య తీవ్రతను బట్టే అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. 11 నెలలుగా పీవో లేకపోవడంతో కొంత నిస్తేజం ఏర్పడ్డ మాట వాస్తవమేనని, వ్యవస్థను గాడిలో పెడతానని అన్నారు. 10వ తరగతి ఫలితాలు పెంచుతామని, ఆ దిశగా కసరత్తు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరిలో ఆర్మీ ర్యాలీ నిర్వహిస్తామని, 500 మందిని ఎంపిక చేసి వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని వెల్లడించారు. తప్పు చేసిన అధికారులను వేరే ప్రాంతానికి పంపించాలన్నా భద్రాచలం కంటే పనిష్‌మెంట్ ఏరియా మరొకటి ఉండదు కదా అని ప్రశ్నించారు. వారితోనే పని చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు.

పరమపవిత్రం...పరశురామావతారం
* పోటెత్తిన భక్తజనం
భద్రాచలం, డిసెంబర్ 16: శ్రీ సీతారామచంద్రస్వామి అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం భక్తులకు పరమ పవిత్రమైన పరశురామావతారంలో దర్శనం ఇచ్చారు. స్వామిని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల దర్శనం అనంతరం స్వామి తిరుమాడ వీధుల్లో తిరువీధి సేవలో పావన దర్శనం అనుగ్రహించారు. అంతకు ముందు స్వామికి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను పరశురామావతారంలో అలంకరించి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా పరశురామావతారం విశిష్టతను వేదపండితులు భక్తులకు వివరించారు. అర్చకులు పరశురామావతార రామయ్యను బేలమండపానికి తీసుకొచ్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన చేశారు. నాళాయర దివ్యప్రబంధం, ద్రవిడ ప్రబంధం పారాయణం చేశారు. వేదవిన్నపాల అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం స్వామి భక్తుల కోలాటాలు, నృత్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ ఊరేగింపుగా మిథిలా మైదానంలోని వేదికపైకి వెళ్లారు. అక్కడ భక్తులు పూజలు చేశారు. స్వామికి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా పెల్వేరుకు చెందిన ఆంజనేయ భాగవతార్ శ్రీనివాస కల్యాణం హరికథా కాలక్షేపం విశేషంగా సాగింది. శ్రీహరి సేవా భజనమండలి నామసంకీర్తన, భక్తిరంజని, కూచిపూడి నృత్యాలు అలరించాయి. కృష్ణలీలలు సురభి నాటకాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. స్వామి తిరుమాడ వీధుల్లో తిరువీధి సేవకు రాజవీధి గుండా గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలందుకున్నారు. తిరిగి ఆలయానికి వచ్చారు.

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
* పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్
* కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 16: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల పోలింగ్ సిబ్బంది, లెక్కింపు అధికారులు సహకరించాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజ్ఞా మందిరంలో ఎన్నికల పోలింగ్ సిబ్బందికి, అధికారులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ తీరును, నిబంధనలను వివరించారు. పోలింగ్ పరిధిలోకి ఓటర్లను అనుమతించే విధానం, ఓటర్లకు బ్యాలెట్ పత్రాలు అందించే విధానం, ఓటింగ్‌కు అనుమతించే ముందు పరిశీలించాల్సిన ధృవప్రతాల పరిశీలనపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఓటు వేసిన అనంతరం ఓటర్లు ష్లిప్‌ను మడిచే విధానం గురించి సిబ్బందికి వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 4 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందని, ప్రతి కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ ఉంటుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు కెడికె వెర్మ పరిశీలించి జిల్లాలోని ఎన్నికల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె బాబురావు, పాల్వంచ సబ్‌కలెక్టర్ కాళీచరణ్, కొత్తగూడెం ఆర్డీవో రవీంధ్రనాథ్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 16: ఎస్సీ వర్గీకరణ జిఓకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్‌పిఎస్ జాతీయ కమిటీ వర్కింగ్ సభ్యులు ఏపూరి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బుధవారం నగరంలో చేపట్టిన ఛలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మయూరి సెంటర్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం జడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు కోసం గత కొనే్నళ్ళుగా ఎంఆర్‌పిఎస్ పోరాటాలు నిర్వహిస్తోందని, అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించటంలేదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాల, మాదిగలు ఇప్పటికే అనేక పోరాటాలు నిర్వహించామన్నారు. ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల నష్టపోయిన మాదిగ, మాదిగ ఉపకులాలు విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాలలో రావాల్సిన న్యాయమైన హక్కులను కోల్పోతున్నారన్నారు. మాదిగ జాతిపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ వర్గీకరణ సమస్యను పక్కదారి పట్టించడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని, దీని కోసం కెసిఆర్ అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని, ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్థానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ మదార్‌సాహేబ్, వంగూరి ఆనందరావు, వీరయ్య, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, కె వెంకటేశ్వరరావు, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

మద్యం అమ్మకాల్లో
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తథ్యం

ఖమ్మం(క్రైం), డిసెంబర్ 16: మద్యం అమ్మకాలలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదని జిల్లా ప్రొబిషినల్ అండ్ ఎక్సైజ్ శాఖ డెప్యూటి కమిషనర్ మహేష్‌బాబు అన్నారు. బుధవారం ఆయనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో కల్తీమద్యం సేవించి పలువురు మృతి చెందటంతో తెలంగాణ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులపై దాడులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 76 మద్యం షాపుల నుండి 133శాంపుల్స్‌ను సేకరించి హైదరాబాద్‌కు పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. వీటిలో ప్రాధమికంగా సుమారు 36షాపుల మద్యం శాంపిల్స్‌ను పరిక్షించగా రెండు షాపుల మద్యంలో నీటి కల్తి జరిగినట్లుగా తేలిందని, మరికొన్ని ఫలితాలు రావల్సి ఉందన్నారు. నిబంధనలకు లోబడి షాపుల్లో విక్రయాలకు సంబంధించి బుక్‌మెయిన్‌టెన్స్, నౌకరినామా లేని వ్యక్తులు పనిచేయడం, ఎంఆర్‌పి ధరలకు మించి అమ్మకాలు చేస్తున్న 18షాపులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. అనుమతి లేకుండా నౌకరినామా కింద పనిచేస్తున్న వ్యక్తులను గుర్తించి ఒక్కొక్కరు నుంచి ఐదువేల రూపాయలు జరిమాన విధించినట్లు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి రాత్రి 11గంటల వరకు మద్యం అమ్మకాలు నిర్వహించాలన్నారు. వైన్స్, బార్ షాపుల్లో మద్యాన్ని మార్పిడి చేస్తూ అమ్మకాలు చేస్తున్న వారిపై లక్ష నుండి మూడు లక్షల వరకు కమిషనర్ ఆదేశానుసారం జరిమానా విధించడంతో పాటు షాపులను సీజ్ చేస్తామన్నారు. షాపుల వద్ద ఎటువంటి అల్లర్లు జరిగితే నిర్వహకులే పూర్తి బాద్యత వహించవల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ నిబందనలను తప్పక పాటించాలని అతిక్రమించిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్షరాస్యతపై అవగాహనా ర్యాలీ

సత్తుపల్లి, డిసెంబర్ 16 : మండల పరిధిలోని గంగారం గ్రామంలో సాక్షరభారతి ఆధ్వర్యంలో నిరక్షరాస్యులకు అవగాహన కల్పించేందుకు అక్షరాస్యత అవసరంపై బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సాక్షారభారతి స్టేట్ నోడల్ ఆఫీసర్ ఆర్. వెంకటేశ్వరరావు ప్రారంభించారు. స్థానిక పంచాయితీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి వరకు ర్యాలీ నిర్వహించి లక్షల కన్నా అక్షరం మిన్న, అందరికి విద్య అందరి బాధ్యత, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. అనంతరం జరిగిన సమావేశంలో అక్షరాస్యత ఆవశ్యకతను ప్రజలకు ప్రతి ఒక్కరూ వివరించాలని, చెట్లపెంపకం వల్ల ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కోటమర్తి రమేష్, ఎంపిడిఓ ఎన్. రవి, సహాయ ప్రాజెక్టు అధికారి మల్లాది గంగాధర్‌రాజు, మండల కో- ఆర్టినేటర్ హరిబాబు, ప్రాధమిక పాఠశాల హెచ్‌ఎం జి. రాఘవరావు,అంగన్‌వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

భద్రాది పవర్ ప్లాంట్‌కు ట్రిబ్యునల్ బ్రేక్

16 పినపాక, డిసెంబర్: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పవర్ ప్లాంటు పనులకు ఆదిలోనే ట్రిబ్యునల్ ఆదేశాలు అడ్డు తగలడంతో భూనిర్వాసితులు ఆందోళనకు గురవుతున్నారు. ప్లాంటు నమ్ముకుని వచ్చిన చిన్న చిన్నా కాంట్రాక్టర్లు డీలాపడిపోయారు. పవర్ ప్లాంటు పనులను ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్ కంపెనీకి అప్పగించింది. ఇప్పటికే ప్లాంటుకు సంబంధించి 70 శాతం మెటిరీయల్‌ను ఇక్కడకు తరలించింది. పవర్ ప్లాంటు చుట్టూ ప్రహరీ నిర్మించి ప్లాంటుకు కీలకమైన బాయిలర్స్ నిర్మాణానికి పునాది పనులు ప్రారంభించారు. కోల్ ప్లాంటుకు సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. 1, 080 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పవర్ ప్లాంటు నిర్మాణంతో తెలంగాణప్రాంతంలో విద్యుత్ కొరతను అధిగమించ వచ్చని ప్రభుత్వం భావించింది. దీని కోసం ఈ ప్రాంతంలో రైతుల దగ్గర నుండి సుమారు 1, 150 ఎకరాల భూమిని సేకరించింది. దీనితో చాలా మంది రైతులు నిర్వాసితులయ్యారు. ఇందులో 105 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. బాధితులంతా రోజుకొక విధంగా ఆందోళనలు చేపడ్తున్నారు. మరి కొంత మంది ఉద్యోగాలు కల్పించాలని ధర్నాలు, ఆందోళనులు చేస్తున్నారు. ప్లాంటు నిర్మాణం పూర్తయితే ఉద్యోగాలొస్తాయని నిరుద్యోగులు ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్స్(ఎస్జీటీ) ఆదేశాలు ఈప్రాంత నిరుదోగ్యులను నిరాశకు గురిచేసింది.
ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్లాంటు నిర్మాణపుపనులను ఏ విధంగా చేపట్టిందని ప్రతిపక్షాలన్నీ నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి.

ఫార్మా రంగంలో ఎఫ్‌డిఐలను నిలిపివేయాలి
* మెడికల్ రిప్రజెంటేటివ్స్ డిమాండ్
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 16: ఫార్మా రంగంలో ఎఫ్‌డిఐలను నిలిపివేయాలని, ప్రభుత్వ రంగ మందుల కంపెనీలను పునరుద్ధరించాలని మెడికల్ రిప్రజంటేటివ్స్ డిమాండ్ చేశారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజంటేటివ్స్ సంఘం నిర్వహిస్తున్న దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో రిప్రజంటేటివ్స్ స్థానిక పెవీలియన్ గ్రౌండ్ నుంచి ర్యాలీగా ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి గుప్తా మాట్లాడుతూ మందుల ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, మందుల ధరలను తగ్గించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశి ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తుందని, దీనిని మానుకోవాలన్నారు. రిప్స్‌పై యాజమాన్యం వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. తమ కనీస వేతనం 15వేల రూపాయలకు పెంచాలన్నారు. మందుల రంగంలో అనైతిక వ్యాపారం, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో నర్సింహరావు, లింగయ్య, శంకర్, సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రత్యేక
పరిశీలకునిగా వెర్మ
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 16: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకునిగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి కెడికె వెర్మ ఖమ్మం జిల్లాకు వచ్చారు. బుధవారం జిల్లాకు వచ్చిన వెర్మను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె బాబూరావు స్థానిక ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా వెర్మతో భేటి అయిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాబూరావు జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై చేపడుతున్న చర్యలను వివరించారు. భారత ఎన్నికల సంఘం నిబంధన, మార్గదర్శకాల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.