ఖమ్మం

అద్దె గర్భాలతో అనర్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యమిస్తూ వారిని ప్రోత్సహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. శనివారం స్థానిక ఎనె్నస్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం అద్దెగర్భాలు అత్యధికంగా ఉంటున్నాయని, కొంతమంది ఏజెంట్లుగా ఉంటూ పేద, గిరిజనులను అద్దె గర్భాలను ప్రోత్సహిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అద్దె గర్భాల కోసం అధికంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలోని పేద, గిరిజన మహిళ, యువతులను ఎంచుకుంటున్నారన్నారు. అద్దెకు గర్భం అందించిన వారికి భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయని, వాటిని ఎదుర్కొవాల్సి ఉన్నప్పటికీ అనేక మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇది దురదృష్టకరమైన సంఘటన అన్నారు.