ఖమ్మం

స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం టౌన్, మార్చి 19: స్వామి వివేకానంద సూక్తులతోకూడిన పుస్తకాన్ని స్వామి వివేకానంద స్వచ్ఛం ద సేవాసమమితి సభ్యులు డిఎస్పీ సురెందరావుకు అందజేశారు. డిఎస్పీ మాట్లాడుతు స్వామి వివేకానంద భారతదేశ ఔనత్యాన్ని, ఖ్యాతిని ఖండాంతారాలలో ఇనుమడింపజేసిన మహానుబావుడు స్వామి వివేకానంద అన్నారు. స్వామి వివేకానంద సూక్తులు వ్యక్తిలో స్ఫూర్తిని రగిలిస్తూ, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి ఆశయసాధనలో విజయం సిద్ధించేందుకు బాటలు వేస్తాయని అన్నారు. నేటి యువత ఆయన ఆశయాలనే స్ఫూర్తిగా కొనసాగించాలని హితవు పలికారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
గార్ల, మార్చి 19: ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని ఇల్లందు నియోజక వర్గ శాసన సభ్యుడు కోరం కనకయ్య అన్నారు.
గార్ల వైస్ ఎంపిపి ఎం వెంకట్‌లాల్, పోచారం సర్పంచ్ ఉమాదేవితో పాటు గార్ల, ముల్కనూరు, పోచారం, రాంపురం గ్రామ పంచాయతీల్లో తెలుగుదేశం, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు వార్డు సభ్యులు, సొసైటి డైరెక్టర్లు పార్టీల క్రియాశీలక సభ్యులు, అనుభంధం సంఘాల బాధ్యులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ఐదు వందల కుటుంబాలు శనివారం వైస్‌ఎంపిపి వెంకట్‌లాల్ నేతృత్వంలో ఎమ్మెల్యే కనకయ్య, టిఅర్‌ఎస్ పార్టీ మండల కమిటి అధ్యక్షుడు వడ్లమూడి దుర్గాప్రసాద్ సమక్షంలో టిఅర్‌ఎస్ పార్టీలో చేరగా వారందరికీ ఎమ్మెల్యే కనకయ్య పార్టీ కండువాలు కప్పి అహ్వానించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత పాలకుల విధానాల కారణంగానే తెలంగాణ ప్రజలు దుర్భర జీవితాలు గడిపారని, సంక్షేమ పథకాలన్ని అర్హులైన పేదలకు అందించడంలో నిర్లక్ష్య వైఖరి అనుసరించారన్నారు. సుదీర్ఘ పోరాటం, ఎందరో వీరుల త్యాగం, ముఖ్యమంత్రి కెసిఅర్ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. సాగు నీటి సదుపాయం కోసం వాగులు, వంకలపై డ్యాములు, చెక్‌డ్యాంలు, ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, రానున్న రోజుల్లో రాష్ట్ర సస్యశ్యామలం కావడం ఖాయమాన్నరు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఅర్ సాగిస్తున్న బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా పార్టీలో చేరిన వారందరికీ పార్టీ క్రియాశీలక సభ్యత్వం కలిగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు వడ్లమూడి దుర్గాప్రసాద్, జడ్పిటిసి ఎద్దు మాధవి, నాయకులు భూక్య నాగేశ్వరరావు, పులిచింతల ఉపేందర్‌రెడ్డి, ఇందుర్తి వెంకటరెడ్డి, కట్ట శ్రీనివాస్, కిషన్, లక్ష్మయ్య, వెంకన్న, హెచ్ రవి, సురేందర్, గార్ల, ముల్కనూరు, పోచారం, మర్రిగూడెం, శేరిపురం, రాంపురం తదితర పంచాయతీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.