ఖమ్మం

పేదలకు విద్య, వైద్యం అందించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), సెప్టెంబర్ 19: కార్పొరేటు స్థాయి విద్య, వైద్యం పేద వర్గాలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక ఎన్‌ఎస్‌పి కాలనీలోని జిల్లా పరిషత్ స్కూల్, గాంధీనగర్, రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వౌలిక సదుపాయాలు, మెరుగైన విద్యకు సమగ్ర ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. గతంలో దేనిని కోల్పొయామో వాటిన్నింటిని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోదన, ముస్లిం మైనార్టీలకు గురుకుల పాఠశాలలో విద్య అందించడంతో పాటు విద్యాభివృద్దికి అధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. విద్యతో పాటు వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిందన్నారు. ఉగాది నాటికి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అదే విదంగా రహదారులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తకుండా అభివృద్ది చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను మెరుగు పర్చేందుకు తమ నిధులను కేటాయించనున్నట్లు వెల్లడించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం డబుల్‌డెస్కులను ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డిప్యూటి మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు, ఆయా పాఠశాలల ఉపాద్యాయ, విద్యార్థులు పాల్గొన్నారు.