ఖమ్మం

కలెక్టరేట్ ముట్టడికి భారీగా తరలిన గిరిజనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, సెప్టెంబర్ 19: జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో కలపాలనే జెఎసి డిమాండ్‌లో భాగంగా సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి మండలం నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కొమ్ముగూడెం, కరివారిగూడెం, పాపకొల్లు, మాచినేనిపేట, మాచినేనిపేటతండా, గుండెపుడి, పడమట నర్సాపురం, వినోభానగర్, జూలూరుపాడు, కాకర్ల, అనంతారం, బేతాళపాడు గ్రామ పంచాయతీ శివారు గ్రామాల నుంచి సైతం గిరిజనులు స్వచ్చందంగా వాహనాలతో బయలుదేరారు. దాదాపు 40కిపైగా వాహనాల్లో సుమారు వెయ్యిమందికి పైగా మహిళలతోసహా నిరసన తెలిపేందుకు కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. దీంతో ప్రధాన రహదారిపై పోలీసు స్టేషన్ నుంచి సాయిబాబాగుడి వరకు కిలోమీటరుకు పైగా ర్యాలీ కొనసాగుతూ ఖమ్మం తరలివెళ్లారు. ర్యాలీ చండ్రుగొండ క్రాస్ రోడ్డు వరకు వచ్చే సమయంలోనే టిఆర్‌ఎస్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సమావేశం ముగియటంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉధృక్తి వాతావారణం నెలకొంది. దీంతో భారీగా తరలివస్తున్న జెఎసి ర్యాలీని కొద్దిసేపు నిలువరించేందుకు సిఐ మల్లయ్యస్వామి నడిరోడ్డుపై ఎదురు నిలబడ్డారు. ర్యాలీకి ముందుగా ఉన్న జెఎసి నేతలు సిఐ వద్ద ఆగటంతో జనంలో ఆందోళన పెరిగింది.
ఇంతలోనే ఎమ్మెల్యే, నాయకులు, కార్యకర్తలు చండ్రుగొండ క్రాస్ రోడ్డు నుంచి వెంగన్నపాలెం గ్రామంలోకి వెళ్లటంతో జెఎసి ర్యాలీ ప్రధాన రహదారిపై ఖమ్మం వెళ్లటంతో వాతావరణం చల్లబడింది. ర్యాలీలో జెఎసి కన్వీనర్ లకావతు గిరిబాబు, నాయకులు చీమలపాటి భిక్షం, బానోతు ధర్మా, యల్లంకి కృష్ణయ్య, వాంక్డోతు వెంకన్న, ఏదులాపురం గోపాలరావు, బానోతు కిషన్ నాయక్, ఎంపిటిసి బానోతు ఇస్రా, జవహర్ ఎల్‌హెచ్‌పిఎస్ జిల్లా అధ్యక్షులు గుగులోతు రాజేష్ నాయక్ తదితరులున్నారు.