ఖమ్మం

జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో కలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 19: జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ జూలూరుపాడు మండల జెఏసి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించి ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల జెఏసి నేతలు లకావత్ గిరిబాబు, గుగులోతు ధర్మా, రాందాస్‌లు మాట్లాడుతూ జూలూరుపాడు మండల కేంద్రం నుంచ కొత్తగూడెంకు 22కిలోమీటర్ల దూరం ఉండగా, ఖమ్మం నగరానికి 63కిలోమీటర్ల దూరం ఉందన్నారు. మండల ప్రజలు అనాదిగా కొత్తగూడెం సంతకు వెళ్ళేందుకు, ధాన్యం, ఇతర పంటల విక్రయానికి కొత్తగూడెం అనువుగా ఉంటుందన్నారు. విద్యాభ్యాసం కోసం సులువుగా సుజాతనగర్, కొత్తగూడెంలు ఉన్నాయని, ఖమ్మం సుదూర ప్రాంతం కావటంతో పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెంలోనే ఉంచితే కలెక్టర్, జెసి, ఆర్డీవో, ఎస్పీ, డిఎస్పీ, మేజిస్ట్రేట్, 100పడకల ఆసుపత్రి, ఇతర పనుల నిమిత్తం కొత్తగూడెం వెళ్ళేందుకు అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చన్నారు. ఖమ్మం చేరుకోవాలంటే సుదూరం కావటంతో గంటన్నర వరకు సమయం పడుతుందన్నారు. ఇదిలా ఉండగా జూలూరుపాడు మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉందని, పోలీస్ డివిజన్ కూడా పరిధి కొత్తగూడెంగా ఉందన్నారు. ఇప్పటికే కోర్టు కేసులు, లావాదేవీలు, పిటి కేసుల తదితర డివిజన్ కేసులు కొత్తగూడెం కోర్టులో పరిష్కారం జరుగుతుందన్నారు. జూలూరుపాడు మండలంలో 70శాతం గిరిజనులు ఉండి రాజ్యాంగ షెడ్యుల్ 5లో ఉన్న ప్రాంతం అని, ఏజన్సీ చట్టాలు, పీసా చట్టం, ఉద్యోగ నియామకం గావిస్తున్న జీవో 3 అమలవుతున్న పరిధిలోని మండలం కావటంతో ఐటిడిఏ సంస్థ ద్వారా సబ్సిడీలు, స్కీమ్‌లు పొందే అవకాశాలు అందుబాటులో ఉంటాయన్నారు. తక్షణమే జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో కలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అదే విధంగా గవర్నర్, ముఖ్యమంత్రి, జిల్లాల పునర్వీభజన సభ్యులకు, ఖమ్మం జిల్లా కలెక్టర్, జెసి, ఆర్డీవోలకు కూడా కొత్తగూడెం జిల్లాలో కలపటం వల్ల జరిగే ప్రయోజనాలను లేఖను అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో కలపాలని చేస్తున్న జూలూరుపాడు మండల జెఏసి నేతలకు మద్దతుగా జిల్లాలోని నంగారాభేరి లంబాడీ హక్కుల పోరాట సమితి నేతలు రాజేష్ నాయక్, బాణోతు భద్రునాయక్, వివిధ సంఘాల నేతలు, జెఏసి నేతలు వెంకన్న, రాందాస్, కృష్ణయ్య, అశోక్, భిక్షం, దొర, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.