ఖమ్మం

తుమ్మల ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానానికి వచ్చే 17న ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 19: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిపేందుకు ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించగా 6వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధించారు. అవసరమైతే ఎన్నికను వచ్చే నెల 17వ తేదీన నిర్వహించాలని, అదే రోజు కౌంటింగ్ జరపాలని కూడా షెడ్యూల్‌లో ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఈ ఎన్నికకు టిఆర్‌ఎస్ అభ్యర్థిగా తిరిగి ఖమ్మం జిల్లా నేతలకు అవకాశం ఇస్తారని భావించినా ఆ పార్టీ అధిష్టానం మాత్రం మొగ్గు చూపలేదు. తుమ్మల రాజీనామతో ఖాళీ అయిన స్థానంలో మెదక్ జిల్లా జహిరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పోటీ చేస్తారని గతంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో నిరాశలో ఉన్న ఖమ్మం జిల్లా నేతలు కనీసం నామినేటెడ్ పదవులు అయినా తమకు ఇవ్వాలని కోరుతున్నారు. గత సాధారణ ఎన్నికల సమయంలో ఖమ్మం అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు ఆ తర్వాత అధికార టిఆర్‌ఎస్ పార్టీలో చేరి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కొంత కాలం తర్వాత ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ్యుడైన కాంగ్రెస్ నేత రామిరెడ్డి వెంకటరెడ్డి మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. విజయం సాధించిన వెంటనే ఆయన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామ చేశారు. దీంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి తిరిగి ఇప్పుడు ఎన్నికల సంఘం ఎన్నిక నిర్వహించనున్నది. అయితే శాసనసభలో మంచి బలం కలిగిన టిఆర్‌ఎస్ తన అభ్యర్థిని ఏకగ్రీవంగానే గెలిపించుకునే అవకాశం ఉంది.