ఖమ్మం

సవాళ్ళను అధిగమించి లక్ష్యాలను సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 22: విదేశీ బొగ్గు దిగుబడుల వల్ల వస్తున్న సవాళ్ళను అధిగమించి సింగరేణి కార్మికులు సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని కొత్తగూడె ఏరియా జిఎం రమణమూర్తి అన్నారు. కొత్తగూడెం ఏరియాలోని జికే ఓసిలో గురువారం మొదటి షిఫ్ట్ ప్రారంభంలో మల్టీ డిపార్ట్‌మెంటల్ బృంద సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏరియా ఎండిటి నాయకులు, జనరల్ మేనేజర్ కెవి రమణ మూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో జిఎం మాట్లాడుతూ 2015-16 సంవత్సరంలో ఉత్పత్తి ఉత్పాదనపై కార్మికులు చైతన్యవంతులై లక్ష్యాన్ని అధిగమించేందుకు సహకరించాలన్నారు. విదేశీసంస్థల బొగ్గు దిగుబడి వల్ల సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను కార్మికులకు వివరించారు. సింగరేణిలో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తిపై కార్మికులను చైతన్యపరుస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బృంద నాయకులు, సభ్యులు ఎస్‌ఓటు జిఎం షాలేం రాజు, ఏజిఎం సత్యనారాయణ, డిజిఎం పి శ్రీనివాస్, డిజిఎం జోతి, డిజి ఎంలు కెజి తివారీ తదితరులు పాల్గొన్నారు.