ఖమ్మం

జిల్లాలో ఓ మోస్త్తరుగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 22: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో రెండు రోజులుగా ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. అత్యధికంగా గుండాల మండలంలో 62.2 మిల్లిమిటర్ల వర్షపాతం నమోదు కాగా, ఏన్కూరు మండలంలో అత్యల్పంగా 4.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. నల్గొండ, వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నా జిల్లాలో మాత్రం సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో జిల్లా రైతుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వేసిన పంటలకు అనుకూలంగా ఉంటాయని పలువురు రైతులు పేర్కొంటున్నారు. కాగా వాతావరణ శాఖ పేర్కొంటున్నట్లు జిల్లాలో భారీ వర్షాలు కురవకపోవడంతో చెరువులు, కుంటలు నిండకపోగా, జిల్లాలోని పలు మండలాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కావడం లేదు. ఇంకా పలు మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అవుతుంది. 10 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 28 మండలాల్లో సాధారణ, 3 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అయింది.