ఖమ్మం

జిల్లా ఛిన్నాభిన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, సెప్టెంబర్ 22: అరవై పదుల అమ్మకు కన్నబిడ్డలు దూరమైతే.. తన ఒడిలో పుట్టి పెరిగిన బిడ్డలను తల్లి నుండి బలవంతంగా వేరుచేస్తుంటే.. ఆ కన్న తల్లి ఎంత తల్లిడిల్లుతుంది. ఈ చేదు అనుభవాలన్నీ ఇప్పుడు ఖమ్మం జిల్లా వాసుల గుండెలను పిండేస్తున్నాయి. పాలకుల పాపమో..దేవుని శాపమో కానీ ఖమ్మం జిల్లా తల్లికి కడుపు కోతే మిగిలింది. కంటనీరు పెడుతూనే తెలంగాణ రాష్ట్రం కోసం తన ఏడు మండలాల బిడ్డలను త్యాగం చేయాల్సి వచ్చింది. త్యాగాల జిల్లా ఖమ్మం అన్న చరిత్రను మరోసారి లోకానికి చాటి చెప్పింది. విభజనతో ఖమ్మం జిల్లా ఛిన్నాభిన్నమైంది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం జారీ చేసిన పోలవరం ఆర్డినెన్స్ కారణంగా ఏజెన్సీలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, నెల్లిపాక, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలను ఆంధ్రాకు అప్పగించింది. పోలవరం ప్రాజెక్టు కోసం ఆర్డినెన్స్ పేరుతో కేంద్రం వేరు కుంపటికి పల్లవి రాస్తే, కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కారు తన కొత్త జిల్లాల చరణంతో చరమగీతమే పాడింది. ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేకుండా అపార ఖనిజ సంపద కల్గిన ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం మండలాలను మహబూబ్‌బాద్ జిల్లాలో కలిపేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనితో మళ్లీ ఖమ్మం జిల్లాకు మిగిలింది త్యాగాల ట్యాగ్‌లైనే. బంగారు తెలంగాణలో భవిష్యత్ కోల్పోయిన జిల్లాగా ఖమ్మం మళ్లీ చరిత్రకెక్కబోతోంది. ఏ తల్లీ భరించలేని బాధను ఖమ్మం తల్లి తన గుండెల్లోనే దాచుకుందనేది మాత్రం కఠినవాస్తవం. విభజనతో ఆస్తులను, ఆప్తులను కోల్పోయి తల్లడిల్లుతున్న ఖమ్మం జిల్లాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
చెట్టుకొకరు...పుట్టకొకరు
విభజించి పాలించడానికి బంధాలు, అనుబంధాలను వేరు చేసి చెట్టుకొకరు, పుట్టకొకరుగా విసిరేశారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో ఆంధ్రాలో విలీనమైన 7 గిరిజన మండలాలకు చెందిన ఆప్తులంతా ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. కానీ ఆర్డినెన్స్ కారణంగా వారంతా వీరికి దూరమయ్యారు. మరి కొన్ని రోజులు పోతే తమ బంధువులను, తల్లిదండ్రులను ఇళ్ల వద్ద వదిలి తెలంగాణలోని భద్రాచలంలో వృత్తి రీత్యా నివాసం ఉంటున్న బిడ్డలు తమ వారిని చూడాలనుకుంటే... ట్యాక్సులు కట్టి వెళ్లాల్సి వస్తుందేమో? అన్న అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాలో మొదటి నుంచీ ఇదే పరిస్థితి. భద్రాచలం రెవిన్యూ డివిజన్‌లోని నూగూరు తాలూకా గతంలో మహారాష్టల్రోని సిరవంచ సంస్థానంలో ఉండేది. కొంత కాలం బస్తర్ రాజ్యం(ఒకప్పటి మధ్యప్రదేశ్ ఇప్పటి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం)లో ఉండేది. వెంకటాపురం, వాజేడు, చర్ల ప్రాంతాలకు చెందిన వారి బంధువులు ఇప్పటికీ ఛత్తీస్‌గఢ్, మహారాష్టల్ల్రో ఉంటున్నారు. రాష్ట్రాల విభజనలు వల్ల వారు తమ వారి నుంచి విడిపోయి అక్కడే నివాసం ఉంటున్నారు. తరతరాలుగా ఈ ఖమ్మం జిల్లా వాసులు ఒకరి అభివృద్ధి కోసం మరొకరి సౌలభ్యం కోసం సమిధలుగా మారుతున్నారు. గుండె నిండా గాయాలతో ఖమ్మం జిల్లా తల్లి పంటి బిగువున తన కడుపుకోతను అదుముకుంటోంది. ఇలాంటి సమయంలోనే ఛిన్నాభిన్నమైన ఖమ్మం జిల్లా తల్లికి ఓదార్పు, హోదాతో కూడిన చికిత్స అవసరం.
అభాసుపాలవుతున్న మధ్యాహ్న భోజన పథకం

గార్ల, సెప్టెంబర్ 22: పాఠశాలల్లో విద్యార్థుల శాతం పెంపొందించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్నా భోజన పథకం అధికారుల నిర్వాహణలో లోపం కారణంగా అభాసుపాలవుతోంది. మండలంలో నెలల తరబడి బిల్లులు అందకపోవడంతో అందించక వర్కర్లు అప్పుల భారంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గార్ల మండలంలో 44 ప్రాథమిక, ప్రాథమికోన్నత, గిరిజన పాఠశాలలు, ఏడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలుండగా ఈ పాఠశాలల్లో మధ్యాహ్నా భోజన పథకం అమలవుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్నా భోజనం అందించేందుకు భోజన వర్కర్లకు 4.76పైసలు, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 6.50పైసలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని భోజనం బిల్లుతో పాటు ప్రభుత్వం వీరి సేవలకు గుర్తించి నెలకు వెయ్యి రుపాయాల చొప్పున అందించనుంది. గత పదకొండు మాసాలుగా నెలకు అందించే వెయ్యి రుపాయాలు, గత మే మాసం నుంచి నేటి వరకు అందించే బిల్లులు చెల్లించ లేదని, దీంతో కిరాణం, కూరగాయల షాపుల్లో అప్పులు పెట్టి వారికి సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నామని వర్కర్లు పెర్కోన్నారు. తమ స్థితిని గుర్తించి ప్రభుత్వం వెంటనే భోజన బిల్లులు చెల్లించాలని వర్కర్లు కోరుతున్నారు.
మధ్యాహ్న భోజన
కార్మికుల వెతలు తీర్చాలి
* డిఎస్‌ఓకు వినతి
ఖమ్మం(కల్చరల్): జిల్లాలో పని చేసున్న మధ్యాహ్న భోజన కార్మికుల వెతలు తీర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలోని మధ్యాహ్న భోజన కార్మికులు డిఎస్‌ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్ కుమారి మాట్లాడుతూ గత ఏడాది మార్చి నుండి 2016ఆగస్టు వరకు బిల్లులు, వేతనాలు రాక కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 18న జిల్లాలోని కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి జిల్లా విద్యాశాఖాదికారికి వినతిపత్రాన్ని అందజేసిన కారణంగా కేవలం 2 నెలల బిల్లులు మాత్రమే చెల్లించారని, వేతనాలను మరిచారని ఆరోపించారు. అందినకాడికి అప్పులు చేసి మధ్యాహ్నభోజనం వండి పెట్టారని ఇంకా అప్పుచేసే స్తోమతలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని,అధికారులు వెంటనే పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెను సవరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మోహనరావు, ఎన్ పద్మ, కాశమ్మ, మంగమ్మ, యశోద, మేరమ్మ, ఉపేంద్ర, అరుణ, ముత్తమ్మ, జ్యోతి, భవాని, భద్రమ్మ, సరోజని, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలపై కళాజాతా ప్రచారం
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 22: తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గురువారం మండలంలో కళాబృంధం సభ్యులు చేపలమడుగు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా అవగాహన కల్పించారు. ఎర్రుపాలెం, రామన్నపాలెం, ఇనగాలి, మలుగుమాడు, మీనవోలు, బనిగండ్లపాడు, తట్టెళ్ళపాడు, జమలాపురం తదితర గ్రామాల్లో ఈ కళాజాత సభ్యులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని సభ్యులు అవగాహన కల్పించారు.