ఖమ్మం

బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 23: బాధితులకు సరైన న్యాయం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్ రేంజ్ డిఐజి సి రవివర్మ పేర్కొన్నారు. డిఐజిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖమ్మం నగరానికి మొదటిసారిగా రావడంతో ముందుగా ఆయనకు జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసీం శుక్రవారం ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా స్పెషల్‌బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతయుతమైన విధులు ఏ విధంగా నిర్వహించాలో పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐలకు తెలియజేయాలన్నారు. అదే విధంగా డిఎస్పీలు విధిగా పోలీసు స్టేషన్లను సందర్శించి వారి పనితీరు పరిశీలించాలన్నారు. శాంతి, భద్రతలను కాపాడటంతో పాటు నేరస్తులను పట్టుకొని శిక్షపడేలా చేయడం వంటి కీలక బాధ్యతలను పకడ్భందీగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా అధికారులు వ్యవహరించాలన్నారు. ప్రధాన రహదారులపై వాహనాలు నిలిపి ప్రమాదాలకు కారణమవుతున్న వాటిపై దృష్టి పెట్టాలని, నేరాలు నియంత్రించేందుకు నిరంతరం పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఓఎస్‌డి భాస్కరన్, డిఎస్పీలు అశోక్‌కుమార్, సురేష్‌కుమార్, సురేందర్‌రావు, రాజేష్, వీరేశ్వరరావు, శ్రీ్ధర్, ఏఆర్‌డిఎస్పీ సంజీవ్, డిపిఓ, ఏఓ సత్యకుమార్, సెక్షన్ సూపరిండెంట్ జయరాజ్, అక్తరున్నీసాబేగం, సత్యవతి, సిఐలు పాల్గొన్నారు.