ఖమ్మం

గ్రామాల్లో ప్రబలుతున్న విషజ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, సెప్టెంబర్ 23: మండల పరిధిలోని పాపకొల్లు మేజర్ గ్రామ పంచాయతీ శివారు గ్రామం ముత్యాలమ్మకాలనీలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలనీలో పారిశుద్ధ్య లోపం తలెత్తింది. అంతర్గత రహదారులు, జనావాసాలు బురద కయ్యలుగా మారాయి. పిల్లలు ఇళ్లనుంచి బయటకు రావలంటేనే భయపడుతున్నారు. రోడ్లపై మోకాళ్లలోతు బురదనీటిలోనే కాలనీ వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పాటు రక్షిత నీటి పథకం పైపులైన్ కూడా అస్తవ్యస్తంగా మారింది. చెక్‌వాల్వ్‌లు పాడైపోవటంతో బురదనీరు పైపులైన్‌లలోకి ప్రవేశిస్తుంది. ఈనీళ్లే కాలనీలో సరఫరా జరుగుతుందని కాలనీ వాసులు వాపోతున్నారు. ఏడాది కాలంగా కాలనీలో పారిశుద్ద్య చర్యలు చేపట్టలేదని, దోమల నివారణా మందులను కూడా పిచికారీ చేయలేదని, రక్షిత నీటిపథకాల క్లోరినేషన్ కూడా చేయటంలేదని కాలనీ వాసుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య లోపంతోపాటు పైపులైన్ లీకేజీపై మండల అధికారులకు చెప్పినా పట్టించుకోవటంలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలనీ వాసులు అనారోగ్యం బారినపడి అల్లాడుతున్నారు. తీవ్రజ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధులతో బాధపడుతూ స్థానిక ఆర్‌ఎంపి వైద్యుల వద్ద వైద్యం పొందుతున్నామని తెలిపారు. కాలనీకి చెందిన భూక్యా రమేష్, నాగమణి, నాగేంద్రబాబు, నవీన్, కిరణ్, ధారావతు చావళి, లక్ష్మా, బాలుతోపాటు పలువురు జ్వరంతో మంచంపట్టారు. ఇప్పటికైనా మండలాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
* జిల్లా వైద్యాధికారి కొండలరావు
బోనకల్లు:గ్రామాల్లో డెంగ్యూ జ్వరాలు అంటు వ్యాధుల్లా ప్రబలుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కొండలరావుసూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన సీజనల్ వ్యాధులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇళ్ళలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచరాదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రజలు రోగాల బారినపడకుండా ఉంటారన్నారు. బోనకల్ మండలంలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఇప్పటికే ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గొవిందాపురం(ఎల్)లో కూడా జ్వరాలు ఉన్నందున వెంటనే తమ సిబ్బందితో వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. మండల ఆయర్వేదవైద్యశాలలో ముందస్తుగా డెంగ్యూ జ్వరాలు తగలకుండా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలోవైద్యాదికారి బాలాజి, అయుర్వేద డాక్టర్ కటకం శ్రీనివాసరావ, ఎంపిడిఓ విద్యాలత, ఎంపిపి చిట్టిమోదు నాగేశ్వరరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పెనుబల్లిలో వైద్య శిబిరం
పెనుబల్లి: పెనుబల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం లంకాసాగర్ పిఎచ్‌సి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని సర్పంచ్ బాణోతు కృష్ణవేణి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యాధికారిని శాంతారాణి హాజరై రోగులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఎక్కువగా సీజనల్ జ్వరాలు వస్తున్నట్లు ఆమె తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇంటి పరిసరాల ఆవరణలను శుభ్ర పరచుకోవాలన్నారు. ఈ కాలంలో తాగునీటిలో మార్పు రావటం వలన నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఎలిజబెత్, నాగమణి, రమాదేవి, ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.